Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రేసులో తెరపైకి కొత్త పేర్లు?

By:  Tupaki Desk   |   23 Sep 2020 3:00 PM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రేసులో తెరపైకి కొత్త పేర్లు?
X
సీఎం కేసీఆర్ తాజాగా త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే పూర్తిగా ఈసారి ఉద్యమకారులకే పట్టం కట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం పాటుపడ్డ వారికే పదవులు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే త్వరలో భర్తీ కాబోయే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఫక్తు తెలంగాణ ఉద్యమకారులకు.. ఇప్పటివరకు పదవులు దక్కని వారికి కట్టబెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారట.. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బరిలో పలు ఆసక్తికర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

తెలంగాణ ఉద్యమంలో పాటపాడి కదంతొక్కి పోరాడిన ప్రజా గాయకుడు , ప్రస్తుత సీఎం కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, అలాగే.. తెలంగాణ వాది, మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ తోపాటు గత లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ మేరకు ఈ ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీపై ఆశలు పెంచుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు ఈసారి నిరాశ ఎదురుకావడం ఖాయమంటున్నారు.

ఇక హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడానికి మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది.గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు. విద్యాసంస్థల అధినేతగా.. లోకల్ గా మంచి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో టీఆర్ఎస్ అతడికే సీటు ఇవ్వాలని యోచిస్తోంది.

ఇక గవర్నర్ కోటాలోనే కళాకారుడి కోటాలో ‘దేశపతి’కి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.. ఒకవేళ అదీ కుదరకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దేశపతిని దించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగబోతున్నట్టు తెలిసింది. ఆయనకు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తోందట.. లేదంటే ఆయన ఒప్పుకుంటే గవర్నర్ కోటాలోనైనా శాసనమండలికి పంపడానికి కేసీఆర్ డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది.

ఇలా ప్రస్తుతానికి కేసీఆర్ మదిలో ఎమ్మెల్సీ స్తానాలకు దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ నాగేశ్వర్, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని వారే ఖాయమన్న ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెంచుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు నిరాశ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.