Begin typing your search above and press return to search.

మోడీ చేతిలో ఇరుక్కుపోయిన కేసీఆర్..

By:  Tupaki Desk   |   29 May 2018 10:07 AM IST
మోడీ చేతిలో ఇరుక్కుపోయిన కేసీఆర్..
X
అన్ని రోజులు ఒకలా ఉండవు.. రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యం.. కానీ అక్కడున్నది మోడీ.. అప్పుడెప్పుడో గోద్రా అల్లర్లప్పుడు చంద్రబాబు అవమానించాడని ఇప్పటికీ చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటున్నాడు మోడీ.. తనను అవమానించిన చంద్రబాబుపై ఓ రకంగా చెప్పాలంటే ప్రతీకారమే తీర్చుకుంటున్నారు. మరి ఫెడరల్ ఫ్రంట్ అంటూ మోడీ పై దుమ్మెత్తిపోసిన కేసీఆర్ ను ప్రధాని ఊరికే వదిలేస్తాడా.? వదిలేయడు. అందుకే ఇప్పుడు కేసీఆర్ కు కొత్త కష్టాలు వచ్చాయి. కేంద్రం అండ లేకుండా కేసీఆర్ ముందుకు పోలోనే పరిస్థితి నెలకొంది.

*కేసీఆర్ జోన్లకు మోడీ మోకాలడ్డు..

సీఎం కేసీఆర్ తెలంగాణ విడిపోయాక చిన్నజిల్లాలు ఏర్పాటు చేశారు. విద్య ఉద్యోగాల్లో గొప్ప సంస్కరణలు చేశారు. ఇప్పటివరకు రెండు జోన్లుగా ఉన్న తెలంగాణను 7 జోన్లుగా విభజించారు. వీటి ఆమోద ముద్ర కేంద్రం చేతిలో ఉంది. కేంద్రహోంశాఖ పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే ఆయన ఆమోదముద్ర వేస్తారు. అప్పుడే తెలంగాణలో కేసీఆర్ కలలు గన్న జోన్ల సిస్టం అమలవుతుంది. దీనికోసమే ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కు బీజేపీ పెద్దలు షాక్ ఇచ్చారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నించినా దక్కలేదని తెలిసింది. అందుకే హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి జోన్లను ఆమోదం తెలపాలని.. రాష్ట్రపతి ఉత్తర్వులకు సహకరించాలని విన్నవించి వచ్చారు. మోడీ కలిసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన్ను కలవకుండానే తిరిగివచ్చారు..

*జోన్ల బాల్ మోడీ చేతిలోనే..

ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎగిరెగిరి పడుతున్న కేసీఆర్ ప్రయత్నాలకు ఇప్పుడు బ్రేక్ వేసే అవకాశం మోడీకి దొరికింది. తెలంగాణలో కొత్త జోన్లను ఏర్పాటు చేయాలంటే కేంద్రం అండ అవసరం.. ఆ అండ ఇవ్వాలంటే మోడీ చేతుల్లోనే ఉంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ వచ్చినా కూడా మోడీ కలవడానికి ఇష్టపడలేదు. కేసీఆర్ ను చెడుగుడు ఆడుకునే అవకాశం ఇప్పుడు మోడీకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్న జోన్ల సిస్టం అమలు కావాలంటే ఇప్పుడు అంతా మోడీ దయాదక్షిణ్యాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్... మోడీని కలిసేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. కేసీఆర్ ఎంత దుందుడుకుగా వెళదామనుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు ఆయన కాళ్లకు బంధం వేస్తున్నాయి.. మోడీ చేతిలోకే జోన్ల సిస్టం నిర్ణయాధికారం పోవడంతో కేసీఆర్ ఇరుక్కుపోయారు. ఇది ఫలిస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా మారింది. ఇలా సర్వాధికారాలు తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. రాష్ట్రాలపై ఎందుకు పెత్తనం చేస్తుందో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరికీ అర్థమవుతుంది.