Begin typing your search above and press return to search.

వివాదానికి చెక్: యాదాద్రి చిత్రాలన్నీ చెరిపేశారు

By:  Tupaki Desk   |   8 Sept 2019 2:05 PM IST
వివాదానికి చెక్: యాదాద్రి చిత్రాలన్నీ చెరిపేశారు
X
యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్ సహా వివిధ అభ్యంతరకర చిత్రాలన్నింటిని తొలగించేశారు. కేసీఆర్, కారు గుర్తు సహా చార్మినార్, కమలం పువ్వు, నెహ్రూ, గాంధీ, ఇతర చిత్రాలు వేయడంపై పెద్ద దుమారం రేగింది. హిందుత్వ వాదులు, బీజేపీ నేతలు యాదాద్రిని ముట్టడించి నానా యాగీ చేశారు.

ఇదో పెద్ద వివాదం కావడంతో తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే నిన్న కేసీఆర్ సహా అభ్యంతరకర చిత్రాలన్నింటిని తొలగించేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన స్థాపతి ఆనంద్ వేలు క్లారిటీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలు, నెహ్రూ, గాంధీ, రాజీవ్, చిర్మినార్, కమలం పువ్వు చిహ్నాలు కూడా తీసివేశామని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే తొలగింపు చర్యలు చేపట్టామని స్థాపతి ఆనంద్ వేలు మీడియాకు తెలిపారు. కేసీఆర్ తోపాటు ఇతర చిత్రాలను చెక్కడంలో ప్రభుత్వ పాత్ర లేదని.. శిల్పులు వారిపై ఉన్న అభిమానంతోనే చెక్కారని మరోసారి వివరణ ఇచ్చారు.

ఇంకా ఆందోళన చేస్తున్న వారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెబితే సరిచేస్తామని స్థాపతి ఆనంద్ వేలు మీడియాకు వివరించారు. దయచేసి రాజకీయం చేయవద్దని సూచించారు.