Begin typing your search above and press return to search.
వరద వేళ టీ ఉద్యోగుల విరాళం.. ఆ వెంటనే కేసీఆర్ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 24 Oct 2020 11:00 AM ISTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు కాస్త భిన్నం. ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఆయన సన్నిహితులు సైతం ఊహించలేకపోతారని చెబుతారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన కరకును.. మరికొన్ని సందర్భాల్లో కలలో కూడా ఊహించలేనంత ఉదారత్వాన్ని ఆయన ప్రదర్శిస్తుంటారు. లాక్ డౌన్ వేళ.. ఉద్యోగులకు జీతాల కోతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం.. తర్వాత సర్దుబాటు చేస్తానని చెప్పటం తెలిసిందే. చివరకు రిటైర్డ్ ఉద్యోగులకు నెలసరి వచ్చే పెన్షన్ లోనూ కోత పెట్టటాన్ని పలువురు తప్పు పట్టారు. అయినప్పటికి ఆయన స్పందించలేదు.
కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగులు.. పెన్షన్ జీవులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఆయన పట్టించుకోలేదు. చివరకు తనకు తానే.. కోతను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగులకు ఆర్నెల్లకు ఒకసారి ఇచ్చే డీఏ విషయంలో ఒక పద్దతి పాడు లేకుండా సాగటం.. కేంద్రం చెప్పినట్లుగా పెంపు లేకపోవటాన్ని రాష్ట్ర ఉద్యోగులు తరచూ ప్రస్తావిస్తుంటారు. అయినప్పటికీ.. ఆ విషయాలపై కేసీఆర్ స్పందించింది లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణకు సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం.. పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి రూ.33 కోట్ల మొత్తాన్ని తమ వంతు సాయంగా సీఎంకు అందించారు. పనిలో పనిగా.. పెండింగ్ లో ఉన్న తమ సమస్యల్ని ఆయనకు నివేదించారు.
తన మాటకు గౌరవంగా రూ.33 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వటానికి ముందుకు రావటం ఎక్కడ టచ్ చేసిందో కానీ.. పెండింగ్ లో ఉన్న అంశాల్ని పరిశీలిస్తానని హామీ ఇవ్వటమే కాదు.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కేంద్రం ప్రకటించే డీఏను.. రాష్ట్రం అమలు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. 2019 జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏను వెంటనే చెల్లించాలంటూ అధికారుల్ని ఆదేశించారు.
అంతేకాదు.. డీఏ విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని చెప్పిన ఆయన.. కీలక సూచన చేశారు. ఇప్పటివరకు మూడే డీఏల విషయంలో రెండు డీఏలను కేంద్రం ప్రకటించాల్సి ఉంది. దాని కోసం ఎదురుచూడకుండా.. ఒక మొత్తాన్ని ఫిక్స్ చేయాలని.. కేంద్రం ప్రకటన తర్వాత.. ఎక్కువ ఉంటే.. ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవటం.. ఒకవేళ రాష్ట్రం ఇచ్చేది కేంద్రం చెప్పిన దాని కంటే తక్కువగా ఉంటే.. ఆ తేడాను చెల్లించేలా చేయాలన్నారు. ప్రతి ఆరు నెలలకు డీఏ ప్రకటన కేంద్రం నుంచి సకాలంలో వచ్చినా రాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి. కేంద్రం ప్రకటన తర్వాత దానికి తగినట్లుగా అడ్జెస్ట్ చేయాలని చెప్పారు.
దీని వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ఏమంటే.. కేంద్రంతో సంబంధం లేకుండా పెరుగుదల క్రమబద్ధంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ అనుకోవాలే కానీ.. సమస్యల్ని ఇట్టే తీర్చేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం పెండింగ్ లో పెట్టిన అంశాన్ని ఇంత సింఫుల్ గా తేల్చేస్తూ.. నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ తీరు ఇప్పుడు మరోసారి ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.