Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు 31వేల కోట్ల సాయం కావాలంట
By: Tupaki Desk | 6 Sept 2015 3:29 PM ISTఅవసరానికి తగ్గట్లుగా మాట్లాడటం మామూలే అయినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరే కాస్త భిన్నంగా ఉంటుంది. మిగిలిన వారికి లేనిది.. కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యేవి కొన్ని ఉంటాయి. తమది సంపన్న రాష్ట్రమని సగర్వంగా చాటుకునే కేసీఆర్.. కేంద్రం నుంచి వచ్చే నిధుల దగ్గరికి వచ్చేసరికి.. వెనుకబడిన కథ వినిపిస్తారు.
తమ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లోని అభివృద్ధికి తగినన్ని నిధులు ఇవ్వాలంటూ తాజాగా కేంద్రానికి కోరటం కనిపిస్తుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కోసం భారీ ప్రణాళికనే రూపొందించిన కేసీఆర్ సర్కారు.. తాజాగా ఆ ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపింది. తానేమీ ఊరికే ఇంత భారీ మొత్తాన్ని అడగలేదని చెబుతున్న ఆయన.. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా.. వెనుకబడిన ప్రాంతాల్లో చేయాల్సి సాయంలో భాగంగానే.. తానీ మొత్తాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇలా కేంద్రాన్ని పెద్ద ఎత్తున సాయం అడగటం కేసీఆర్ కు కొత్తేం కాదు. గత ఏడాది కేంద్రం నుంచి సాయం కోసం దాదాపు రూ.56,646 కోట్ల మొత్తాన్ని సాయం చేయాలంటూ ప్రతిపాదనలు పంపారు. అయితే.. సంపన్న రాష్ట్రంలో సంపన్న ప్రాంతాలైన హైదరాబాద్.. రంగారెడ్డి..నిజామాబాద్.. కరీంనగర్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని పంపారు. గతంలో పేర్కొన్న ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే సాయం కోరాలని కోరటంతో.. తాజాగా మార్పులు చేసి.. రూ.31వేల కోట్ల భారీ మొత్తానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపారు.
సంపన్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రమే ఇంత భారీ మొత్తాన్ని కోరితే.. మరి.. విభజన కారణంగా భారీగా నష్టపోయిన సీమాంధ్ర ఏ స్థాయిలో కేంద్రం సాయం అడగాలో..?అన్న సందేహం రాక మానదు. చూస్తుంటే.. కేంద్రాన్ని సాయం ఎలా అడగాలో కేసీఆర్ ను చూసి.. చంద్రబాబును నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లుందే.