Begin typing your search above and press return to search.
ఇక.. హైటెక్కు సీఎం హోదా కేసీఆర్ కేనా?
By: Tupaki Desk | 5 April 2016 10:36 AM ISTరెండు కళ్లు.. రెండు కళ్లు అంటూ అదే పనిగా చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అన్ని ఇబ్బందులేనని చెప్పాలి. పేరుకు ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆయనకు ఒరుగుతున్నదేమీ లేదు. కేంద్రంలో అధికారపక్షానికి మిత్రుడిగా ఉన్నప్పటికీ మోడీ ఆదరణ పొందని వైనం ఆయన్ను ఒకవైపు కలిచివేస్తుంటే.. తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవంతో ఏపీకి ఎంతో చేయాలని భావించినా.. అప్పుల కుప్పతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కారణంగా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి.
తన కారణంగా హైదరాబాద్ తెగ అభివృద్ధి చెందిందని చెప్పుకునే చంద్రబాబు.. అలాంటి హైదరాబాద్ లను తాను తయారు చేస్తానన్న ధీమాను వ్యక్తం చేసినా.. గడిచిన 22 నెలల కాలంలో ఆయనేమాత్రం చేశారో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తన పట్టును రోజురోజుకీ పెంచుకోవటమే కాదు.. సాంతికేతికత సాయంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలతో హైటెక్ ముఖ్యమంత్రి అన్న భావన కలిగేలా చేయటం గమనార్హం.
నిజానికి హైటెక్ ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ లైన్ చంద్రబాబుదే అయినప్పటికీ.. మారిన కాలానికి తగ్గట్లుగా తనకున్న హైటెక్ ట్యాగ్ ను కేసీఆర్ కు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు. ఇటీవల కాలంలో హైటెక్ తరహాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ అదిరిపోవటమే కాదు.. ఈ తరహా ప్రయత్నం దేశంలోని మరే సీఎం చేయలేదన్న ఖ్యాతిని మూటగట్టుకున్నారు.
తాజాగా తెలంగాణ ఐటీ పాలసీ ఆవిష్కరణ సందర్భంగా బ్రోచర్ విడుదల కార్యక్రమానికి ఒక రోబోను వినియోగించటం.. సదరు రోబో నడుచుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి చేతికి బ్రోచర్ ను ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి కొత్త టెక్కులతో తానే హైటెక్ సీఎం అన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేస్తున్నట్టుంది కదూ.