Begin typing your search above and press return to search.
ప్యాచప్ చేయటమే గులాబీ బాస్ కింకర్తవ్యం
By: Tupaki Desk | 9 Sept 2019 10:26 AM ISTమనలో మనం ఎన్నైనా కొట్టుకుందాం. కానీ.. కొత్తోడు ఒకడొచ్చి మన మధ్య పుల్ల పెట్టాలనుకుంటే మాత్రం వాడి ఎత్తులు పారనీయకూడదన్న వ్యూహం కొందరి దగ్గర తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి.. ఇదే తరహా ఆలోచన భారతీయ రాజులు కానీ చేసి ఉంటే.. బ్రిటీషోళ్ల చేతికి భారత్ వెళ్లేదే కాదు..స్వాతంత్య్రం కోసం అన్నేళ్లు పోరాడాల్సి వచ్చేది కాదు. నిజానికి.. చరిత్ర మరోలా ఉండేది. జరిగింది జరిగిపోయింది. కానీ.. జరగాల్సింది చేతిలో ఉన్న వేళ.. తనలో ఏదైతే మిస్ అయ్యిందో.. దాన్ని గుర్తించి సరి చేసుకునే పనిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డారా? అన్న భావన కలిగేలా తాజాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రం కొలువు తీరాక ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖను చేపట్టి.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పరుగులు తీయించిన హరీశ్ కు తర్వాతి కాలంలో ఏమైంది? ఏం జరిగిందన్నది అందరికి తెలిసిందే. రెండోసారి టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలలకు కానీ అత్యధిక మెజార్టీతో గెలిచిన హరీశ్ కు మంత్రి పదవి దక్కలేదు.
కీలకమైన ఎన్నికల సమయంలో తమ సొంత మీడియాలో హరీశ్ ఫోటో అన్నదే లేకుండా చేసి.. తర్వాతి కాలంలో అప్రాధాన్య స్థానంలో ఫోటోలు వేయటంపై పెద్ద రచ్చే సాగింది. కేసీఆర్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ ను పక్కన పెట్టేయటం.. అసలు అలాంటోడు ఒకడున్నాడన్న భావన కలగకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
ఇలాంటివేళలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అంటూ రిథమిక్ నినాదంతో వెళ్లిన గులాబీ అధినేత.. ఆయన కుమార రత్నానికి తెలంగాణ ఓటర్లు ఇచ్చిన షాకు అలాంటి ఇలాంటి కాదు. పదహారు స్థానాల్ని సొంతం చేసుకొని కేంద్రంలో కీలకంగా మారటమే కాదు.. అన్ని కలిసి వస్తే ప్రధాని పదవి వంక కూడా ఒక చూపు చూడాలన్న భారీ పథకాన్ని ఆదిలోనే తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టటం ఒక ఎత్తు అయితే.. మోడీ లాంటోడ్ని తక్కువ అంచనా వేయటం ఎంత తప్పన్న విషయం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కానీ అర్థం కాని పరిస్థితి.
ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తీరు మారనట్లుగా వ్యవహరించిన కేసీఆర్ కు.. ఇటీవల కాలంలో కేంద్రం వేస్తున్న ఎత్తులు.. కమలనాథులు మొదలెట్టిన విమర్శల పరంపర ఆయన్ను అలెర్ట్ అయ్యేలా చేసిందా? అన్న ప్రశ్నకు అవుననే చెప్పాలి. గడిచిన తొమ్మిది నెలల్లో తానేం చేయకూడదో.. అవన్నీ చేసిన నేపథ్యంలో.. జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకోవటంతో పాటు.. లోటు పాట్లను కవర్ చేసేందుకు వీలుగా కొత్త ఎత్తులతో ఆట మొదలెట్టేందుకు రెఢీ అయ్యారు కేసీఆర్.
తన బలమైన హరీశ్ ను పక్కన పెట్టటం ద్వారా జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వటం ఒకటైతే.. హరీశ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న భావన కలిగేలా కేటీఆర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఇప్పటికే కన్ఫర్మ్ అయిన కేటీఆర్ కు.. అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉందన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేయటంతో పాటు.. హరీశ్ అంటే తనకు ప్రేమాభిమానాలు.. గౌరవం ఉన్నట్లు.. అందరికి అర్థమయ్యేలా వ్యవహరించారు కేటీఆర్. తమలో చీలిక తీసుకురావటం ద్వారా రాజకీయ లబ్థి పొందాలని చూస్తున్న కమలనాథులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లుగా గులాబీ బాస్.. ఆయన కుమారుడి తీరు ఉందని చెప్పక తప్పదు. ఏమైనా.. కమలనాథులు మొదలెట్టిన గేమ్ కు తనదైన ఆట ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని కేసీఆర్ తన తాజా చర్యలు చెప్పేశారని చెప్పాలి.