Begin typing your search above and press return to search.
బీజేపీతో వార్ కు కేసీఆర్ సిద్ధం? ‘8’తోమొదలెట్టినట్లేనా?
By: Tupaki Desk | 6 Dec 2020 3:00 PM ISTగ్రేటర్ ఎన్నికలు అయిపోయిన వెంటనే.. జాతీయస్థాయి నేతలతో.. పార్టీలతో కలిసి ఫ్రంట్ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తానని చెప్పటం తెలిసిందే. పలు పార్టీ అధినేతల్ని హైదరాబాద్ కు తీసుకొస్తానని చెప్పటం మర్చిపోలేం. గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో షాక్ తగలటంతో.. జాతీయ ఫ్రంట్ మీద కేసీఆర్ ఏలా రియాక్టు అవుతారన్న సందేహం వ్యక్తమైంది. గెలిచినంతనే బయటకు వచ్చే కేసీఆర్.. ఓటమి వేళ.. ఏ మాత్రం బయటకు రారన్న అలవాటును ఈసారి కంటిన్యూ చేశారు. తనకు ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులోకి లేకుండా ఉండటం ఆయనకు మామూలే.
ఉద్యమ సమయంలో ఇలాంటివెన్నో కేసీఆర్ లో కనిపిస్తాయి. మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే.. తనకు రాజకీయ అవసరాలు ఉన్నప్పుడు ఏదైనా విషయాన్ని ఎంత బలంగా చెబుతారో.. ఆ ఇష్యూ తాను అనుకున్నట్లు అయిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇలానే జరుగుతుందనుకున్నారు. గ్రేటర్ లో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లుగా ఉండటం.. ఆ సందర్భంగా జాతీయ ఫ్రంట్ ను తెర మీదకు తీసుకురావటంతో పాటు.. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పారు. తమకు ఓటు వేస్తే.. హైదరాబాద్ భద్రంగా ఉన్నట్లేనని తేల్చిన ఆయన.. ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురైన ఎదురుదెబ్బ నేపథ్యంలో.. బీజేపీపై పోరుకు సమయం ఆసన్నమైందన్నట్లుగా ఆయన తీరు ఉంది.
దేశ రాజధాని శివారులో పెద్ద ఎత్తున జరుగుతున్న రైతు ఉద్యమం మీద మాట్లాడని ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఈ నెల 8న రైతుసంఘాలు తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. మోడీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత.. ఇంత ఓపెన్ గా ఆయనకు ఆయనగా అధికారపక్షంతో వార్ కు సిద్ధమైనట్లుగా సంకేతాలు ఇవ్వటం ఒదే మొదటిసారి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైర పోరాటాన్ని చేస్తున్నారని సమర్థించిన కేసీఆర్.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొంటారని చెప్పారు.
బంద్ ను విజయంతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. ప్రజలంతా బంద్ లో పాల్గొని రైతాంగానికి అండగా నిలవాలన్నారు. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం చూస్తే..బీజేపీని ఇక ఏ మాత్రం ఊపేక్షించకూడదన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తమను ఎంతలా దెబ్బ తీసిందో అనుభవంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీతో పోరుకు తాను రెఢీ అన్న విషయాన్ని తాజాగా బంద్ కు మద్దతు పలకటం ద్వారా చెప్పేశారని చెప్పాలి.