Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్.. ఎవరికెన్ని సీట్లంటే.?
By: Tupaki Desk | 18 May 2019 3:23 PM ISTటీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్థులకు అంతుచిక్కని విధంగా ఉంటాయి. ఆయన ఆలోచనలను పసిగట్టడం చాలా కష్టమంటారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పద్మవ్యూహాలు అల్లడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా చెబుతుంటాయి. పైగా తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఆయనకు బలం పెరిగింది. వివిధ సర్వే ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ ద్వారా కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలపై తన మనోగతాన్ని టీఆర్ ఎస్ ముఖ్యులతో పంచుకున్నట్టు తెలిసింది..
తాజాగా కేసీఆర్ టీఆర్ ఎస్ ముఖ్యులతో చెప్పిన లెక్క ప్రకారం.. దక్షిణాదిన బీజేపీకి 9 నుంచి 10 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ఇదే రీతిన బీజేపీ మీద వ్యతిరేకత కొనసాగిందని.. కమలదళం దాదాపు 130 సీట్లలోపే పరిమితం అవుతుందని కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకోదని.. ఆ పార్టీకి 110 నుంచి 120 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని కేసీఆర్ అంచనావేసినట్టు సమాచారం. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారట..తెలంగాణలో టీఆర్ ఎస్ మొత్తం 17 స్థానాల్లో 16 సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుందని.. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో టీఆర్ఎస్ కీరోల్ పోషిస్తుందని కేసీఆర్ విశ్వాసంతో ఉన్నారట..
అయితే కేసీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఇలాగే ఉంటే.. దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా అచ్చం ఇదే అంచనావేయడం విశేషం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా బీజేపీకి 100 సీట్లు దాటవంటూ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో బీజేపీకి ఒక్క సీటు రాదని కుండబద్దలు కొట్టారు. అసలు దక్షిణ భారత్ లో బీజేపీకి ఆశలే లేవని ఆమె స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమకు 300 సీట్లు పక్కా అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీలు నిన్ననే ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. మరి మే 23న ఎవరి అంచనాలు నిజమవుతాయో వేచిచూడాల్సిందే..