Begin typing your search above and press return to search.

సిటీలో టూవీలర్ అంబులెన్సుల్ని తేనున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   2 March 2016 10:25 AM IST
సిటీలో టూవీలర్ అంబులెన్సుల్ని తేనున్న కేసీఆర్
X
రాష్ట్రం ఏదైనా సరే.. వినూత్న విధానాల్ని పాటిస్తుంటే చాలు.. వాటిపై అధ్యయనం చేయటం.. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేసి అమలు చేయటం ఒక అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ సర్కారు.. తాజాగా మరో వినూత్నవిధానానికి తెర తీసింది. రద్దీ సమయాల్లో జరిగే ప్రమాదాలకు సంబంధించి తక్షణ వైద్య సేవల్ని అందించేందుకు వీలుగా.. టూవీలర్ అంబులెన్స్ ల్ని హైదరాబాద్ మహా నగరంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు డిసైడ్ చేసింది.

ఇప్పటికే ఈ విధానాన్ని బెంగళూరు.. చెన్నై మహానగరాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా 50 టూవీలర్ అంబులెన్స్ ల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేయనున్న ఈ కసరత్తు సక్సెస్ అయితే..రాష్ట్రం మొత్తం విస్తరించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. 108 అంబులెన్స్ లు వెళ్లలేని చోట్లకు.. ప్రమాదం చేరుకున్న వెంటనే వెళ్లేలా.. తక్షణ వైద్యసాయం అందించేందుకు ఈ టూవీలర్ అంబులెన్స్ లు సాయం చేయనున్నాయి.

తొలిదశలో రూ.75లక్షల ఖర్చుతో 50 అంబులెన్స్ ల్ని రోడ్ల మీదకు తేనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ టూవీలర్ అంబులెన్స్ సర్వీసుల్ని అందిచనున్నారు. ఈ టూవీలర్ అంబులెన్స్ లలో ఆక్సిజన్ సిలిండర్.. పైపులు.. పల్స్ ఆక్సిజన్ మీటర్.. బీపీ చూసే పరికరంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే మందులు.. తదతర మెడిసిన్స్ ఉండనున్నాయి. బెంగళూరు.. చెన్నై మహానగరాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని కేసీఆర్ సర్కారు అందిపుచ్చుకోవటం మంచి పరిణామం. హైటెక్ చంద్రబాబు సైతం ఈ ఐడియాను ఏపీలో అమలు చేస్తే మంచిది.