Begin typing your search above and press return to search.

కేసీఆర్ దత్తకూతురు ప్రియుడి మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   10 May 2016 5:08 PM GMT
కేసీఆర్ దత్తకూతురు ప్రియుడి మాటలు విన్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త కుమార్తె ప్రత్యూష లవ్ మ్యాటర్ తెలిసిందే. సవతితల్లి చేతిలో నరకం చవిచూడటం.. అనూహ్యంగా ఆమె వ్యవహారం బయటకు రావటం.. ఆమె ఉదంతం గురించి విని తెలుగు రాష్ట్రాల ప్రజలు తల్లడిల్లటం తెలిసిందే. ప్రత్యూష పడిన కష్టాలు విన్న వారెందరో ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించి.. కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పలుకరించటమే కాదు.. తన దత్త కుమార్తెగా ప్రకటించుకున్నారు కూడా. ఆమెకు తన కుమార్తెలా చూసుకుంటానని మాటిచ్చారు కూడా.

ఇదిలా ఉంటే.. ప్రత్యూష ఆ మధ్యన కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి అనే యువకుడితో లవ్ లో పడటం.. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టికి వెళ్లటం.. వారు క్రాస్ చెక్ చేసి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తసుకెళ్లినట్లు చెబుతున్నారు. తన దత్తకుమార్తె లవ్ మ్యాటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందన ఏమిటన్నది బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రత్యూష ప్రియుడు మద్దిలేని విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దత్త కూతుర్ని తాను ప్రేమించానని.. తన పెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే జరగాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని చెబుతున్న మద్దిలేటికి తగ్గట్లే.. తాజాగా ప్రత్యూష తనకు తన ప్రియుడు మద్దిలేటితో పెళ్లి జరిపించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం నేతల్ని సంప్రదించటం గమనార్హం. వాళ్లను వీళ్లను సంప్రదించే కన్నా.. దత్త తండ్రినే అనుమతి కోరితే సరిపోతుంది కదా..?