Begin typing your search above and press return to search.
పార్టీ నేతలకు కొత్త తీపికబురు చెప్పనున్న కేసీఆర్
By: Tupaki Desk | 23 Feb 2017 4:50 AM GMTతెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో నామినేటేడ్ పోస్టుల భర్తీ చేయటం లేదన్న నిరుత్సాహపడుతున్న పార్టీ నేతలకు - కార్యకర్తలకు కొత్త తీపికబురు అందించేందుకు గులాబీ దళపతి కేసీఆర్ కొత్త తీపికబురు అందించనున్నట్లు చెప్తున్నారు. టీర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అధిక సంఖ్యలో ఏడు ఎమ్మెల్సీ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చే నెలలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీంతో పాటు ఏప్రిల్ - మే నెలలో మరో 3 స్ధానాలు ఖాళీ అవనున్నాయి. మొత్తానికి వచ్చే 4 నెలల్లో ఏడుగురు ఎమ్మెల్సీ శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో నిరీక్షణలో ఉన్న నాయకులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం ద్వారా కేసీఆర్ తీపికబురు అందిస్తారని భావిస్తున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న కాటేపల్లి జనార్ధన్ రెడ్డికే టీఆర్ ఎస్ మద్దతు ఇస్తోంది. మరో 3 స్ధానాలకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 7 వరకు నామినేషన్లను స్వీకరణ, 10న ఉపసంహరణ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 17న ఎన్నికలు చేపట్టి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించునున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ తమ గెలుపు ఖాతాలో మరో ఎన్నిక జత కాబోతుందని భరోసాతో ఉంది. తెలంగాణ శాసనమండలిలో 3 స్ధానాలు ఖాళీ అవనుండటంతో వాటిలో గులాబీ నేతలు గెలుస్తారని విశ్లేషిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాగం రంగారెడ్డి - టీఆర్ ఎస్ నుంచి గంగాధర్ గౌడ్, ఎంఐఎం నుంచి సయ్యద్ అల్తాఫ్ రజ్వీ పదవికాలం ముగియనుంది. శాసనసభలో అధికార పార్టీ బలం ప్రకారం 3 స్ధానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ 3 స్ధానాల్లో ఒక స్థానం మిత్ర పక్షమైన ఎంఐఎంకు ఇచ్చే సూచనలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగతా రెండు స్ధానాలో సిట్టింగ్ సభ్యుడైన గంగాధర్ గౌడ్ కు మళ్లీ అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరే సమయంలో కేసీఆర్ ఈ హామి ఇచ్చారని, అందువల్లనే ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇక మిగిలిన ఒక సీటు కోసం పార్టీలో తీవ్ర పోటి నెలకొంది.
కాగా, ఈ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఇంతవరకు పదవులు దక్కని వారు దీనిలో ముందు ఉన్నారు. ఈ సీటు కోసం పాలమూరు జాల్లాకు చెందిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి - మెదక్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ - పట్టభద్రుల కోటా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయిన ఉద్యోగ సంఘం నేత దేవీ ప్రసాద్ ముందంజలో ఉన్నారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎమ్మెల్సీగా పనిచేసిన మెదక్ జిల్లాకు చెందిన ఆర్ సత్యనారాయణ కూడా మండలి సీటును ఆశిస్తున్నారు. వీరిలో సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది అసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ నుంచి పదవి కాలం ముగుస్తున్న మాగం రంగారెడ్డి మళ్లీ గెలవడం కష్టం. కాంగ్రెస్ ఉన్న సంఖ్యాబలం లేదు. దీంతో ఈ 3 స్ధానాలు టీఆర్ ఎస్ గెలువడం సులువు. ఎంఐఎం కు ఒక స్ధానం ఇచ్చి మరో రెండు స్ధానాల కు టీఆర్ ఎస్ అభ్యర్ధులను ఎంపిక చేసే భాద్యత సీఎం కేసీఆర్ తీసుకోవడంతో ఈ ఇద్దరు అభ్యర్ధులు ఎవరన్నది గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ ఎన్నికలు కొంత మేర ఊరట కల్పిస్తాయని పలువురు పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ అవిర్బావం నుంచి పనిచేస్తున్న ఇప్పటికి పదవులకు దూరంగా ఎంతో మంది ఉన్నారని, వారిని ఇప్పటికి హైకమాండ్ గుర్తించటం లేదని ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నామినేటేడ్ పోస్టుల భర్తీ సీఎం కేసీఆర్ చేస్తారా లేదా వాయిదా వేస్తారా అన్నది తెలియాలంటే మరి కొంత కలం వేచి చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/