Begin typing your search above and press return to search.
రెండేళ్ల తర్వాత కూడా మాట తప్పనన్న కేసీఆర్
By: Tupaki Desk | 27 Jun 2016 5:17 AM GMTహామీలు ఇవ్వటం ఒక ఎత్తు. వాటిని నెరవేర్చటం మరో ఎత్తు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకున్నా.. వాటిని నెరవేరుస్తామంటూ ధీమాగా చెప్పి.. ప్రజల్ని ఒప్పించటం ఇంకో ఎత్తు. ఈ మూడింటిలో.. కష్టమైనది చివరిదే. అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేమంత కష్టం కాదు. ఇచ్చిన హామీల్ని రెండేళ్లు గడుస్తున్నా.. పూర్తి చేయని వైనానికి తత్తరపడుతూ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ.. కేసీఆర్ అందుకు భిన్నం. ఆయన ఎంత బాగా కవర్ చేశారో.. అసాధ్యమైన12 శాతం మైనార్టీ రిజర్వేషన్ ను తాను చేసిన చూపిస్తానంటూ బహిరంగ సభలో చెప్పిన తీరు చూసినప్పుడు ముచ్చట వేయక మానదు.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వటం అంటే మాటలు కాదు. దానికి చాలానే లెక్కలు ఉన్నాయి. కేసీఆర్ ఎంత ఇవ్వాలనుకున్నా.. కేంద్రం చేత ఓకే అనిపిస్తే తప్ప అమలు సాధ్యం కాదు. ఇప్పటికే.. ఈ తరహా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని ప్రధాని మోడీ కుండబద్ధలు కొట్టిన తర్వాత కూడా.. తానిచ్చిన హామీని అమలు చేస్తామని ధీమాగా చెప్పుకొచ్చిన కేసీఆర్ ను చూస్తే.. ఆయనేం చూసుకొని ఇంత నమ్మకంగా చెబుతున్నారనిపించక మానదు.
నిజాం కాలేజీలో ముస్లింసోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందునకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తమ ప్రభుత్వం మైనార్టీలకు ఎంత చేస్తున్నామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే అధికారికంగా ముస్లింల కోసం మసీదుల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిందన్నరు. రిజర్వేషన్ల కోసం కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. ఆ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు చేపట్టి.. దాన్ని ఢిల్లీకి పంపనున్నట్లుగా చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఒక కొలిక్కి రాని రిజర్వేషన్ వ్యవహారం.. ఇంకెంత కాలానికి వస్తుందో చూడాలి.