Begin typing your search above and press return to search.

ఆ గ్రామాల్ని బాబు తిరిగి ఇచ్చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   16 Feb 2016 4:29 AM GMT
ఆ గ్రామాల్ని బాబు తిరిగి ఇచ్చేస్తున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఏపీ విభజన చట్టాన్ని మార్చి మరీ తెలంగాణకు చెందిన కొన్ని గ్రామాల్ని ఏపీలో కలపటం తెలిసిందే. తమకు చెందిన గ్రామాల్నిఏపీలో కలపటంపై కేసీఆర్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కుట్రతో తమ గ్రామాల్ని ఏపీలో కలిపారంటూ ధ్వజమెత్తటం తెలిసిందే.

మరి.. ఆ గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెఢీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యను కేసీఆర్ చేయటం గమనార్హం తన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఆయనీ విషయాన్ని వెల్లడించటం గమనార్హం. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన గ్రామాల గురించి కొందరు ఉద్యమం చేయటం.. ఈ అంశంపై పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత.. చట్టాన్ని మార్చి మరీ గ్రామాల్నికలిపేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకున్నాక.. దాని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదని సామూహిక సర్వే సమయంలో కేసీఆర్ వ్యాఖ్యానించటం మర్చిపోకూడదు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల స్థితిగతులు.. వివరాల కోసం చేపట్టని సర్వే పూర్తి అయిన సందర్భంగా.. ఆయన ఏపీలో కలిసిన గ్రామాల గురించి విస్పష్టంగా మాట్లాడటంతో పాటు.. వాటి మీద ఆశలు వదులుకోవాలన్న విషయాన్ని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత కేసీఆర్.. ఈ గ్రామాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అలాంటిది తాజాగా ఖమ్మం పర్యటనలో ఏపీలో కలిపిన తెలంగాణ గ్రామాల్ని తిరిగి వెనక్కి ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నారని.. త్వరలోనే అవి వెనక్కి వచ్చేస్తాయని ప్రకటించటం గమనార్హం. అక్కడ ఉన్నది తెలుగువారేనని.. వారికి అవసరమైన సాయాన్ని తాము చేస్తామని కేసీఆర్ పేర్కొనటం గమనార్హం.