Begin typing your search above and press return to search.
తెరాస శ్రేణులను మురిపించిన ఫ్లెక్సీ ఇదే!
By: Tupaki Desk | 23 July 2016 7:25 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీ తాజా చిత్రం 'కబాలి' సినిమా ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండి శుక్రవారం విడుదలయ్యేవరకూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భూమిపైనే కాదు ఆకాశంలో కూడా కబాలి మానియేనే ఆవహించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 65 దేశాల్లో విడుదలయిన ఈ కబాలి చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటకే చూసేందుకు అభిమానులు చేసిన చిత్రాలు, పడ్డ పాట్లూ అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. ఈ క్రమంలో కబాలి హీట్ పొలిటీషియన్స్ కి కూడా పాకిందనే చెప్పాలి.
అయితే ఈ చిత్రం విడుదల సమయంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రకరకాలుగా ఆసక్తిని కనబరిచేవిగా ఉంటే.. హైదరాబాద్ లో అభిమానులు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మరేదో కాదు.. రజనీ కాంత్ - కేసీఆర్ లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఈ పోస్టర్ పై రజనీకాంత్ ఫోటో పక్కనే కేసీఆర్ ఫోటో పెట్టిన అభిమానులు ఆసక్తికరమైన కొటేషన్స్ రాశారు. ఈ ఫ్లెక్సీలో... నెంబర్ వన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ అని రాసిన అభిమానులు... ఇండియాలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రస్థావించారు. దీంతో ఈ ఫ్లెక్సీకి క్రేజ్ పెరిగింది.. ఈ ఫ్లెక్సీని చూసిన తెరాస శ్రేణులు మురిసిపోతుంటే... అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయిస్తున్నారు.
తాజాగా విడుదలయిన బెస్ట్ సీఎం ర్యాంకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కు నెంబర్ వన్ స్థానం రాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 13వ స్థానం వచ్చిందని చెబుతున్న సంగతి తెలిసిందే! దాంతో ఈ ఫ్లెక్సీ కి మరింత క్రేజ్ వచ్చిందని చెప్పాలి.