Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరిన‌న్ని ఇళ్లు ఇచ్చేశారు!

By:  Tupaki Desk   |   21 Dec 2015 1:40 PM GMT
కేసీఆర్ కోరిన‌న్ని ఇళ్లు ఇచ్చేశారు!
X
కేంద్రంతో అంతంత‌మాత్రంగా సంబంధాలు ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునే విష‌యంలో తెలంగాణ స‌ర్కారు విజ‌యం సాధిస్తోంది. డ‌బుల్ బెడ్ రూం ఫ్లాట్ల‌ను తెలంగాణ‌లోని పేద‌ల‌కు అందించాల‌న్న భారీ ప‌థ‌కాన్ని చేప‌ట్టి.. కేంద్ర సాయం కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న తెలంగాణ స‌ర్కారు డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కొన్ని రాష్ట్రాల‌కు ఇళ్ల‌ను కేటాయించిన కేంద్రం.. అప్ప‌ట్లో తెలంగాణ‌కు కేవ‌లం 10వేల ఇళ్ల‌ను మాత్ర‌మే కేటాయించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ప‌క్క‌నున్న ఏపీకి భారీగా ఇళ్ల‌ను కేటాయించి.. తెలంగాణ‌కు మ‌రీ త‌క్కువ‌గా కేటాయిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌మ‌కు మ‌రిన్ని ఇళ్లు కేటాయించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రం కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ స‌ర్కారు తాజాగా 45,217 ఇళ్ల‌ను కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో కేటాయించిన దానికి అద‌నంగా కేటాయింపులు జ‌రిపిన కేంద్రం.. తెలంగాణ స‌ర్కారు కోరిన‌న్ని ఇళ్లు కేటాయించిన‌ట్లుగా పేర్కొంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ఇళ్ల విష‌యంలో తెలంగాణ రాష్ట్రం అసంతృప్తి చ‌ల్లారే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.