Begin typing your search above and press return to search.
దూరం ఆలోచించక దూకుడుగా 'బండి' అరెస్టుకు ఓకే చేశారా?
By: Tupaki Desk | 6 April 2023 10:56 AM GMTకీలక నిర్ణయాలు తీసుకునే వేళలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంత త్వరగా తొందరపడరు. ప్రతి విషయం మీదా కూలంకుశంగా కసరత్తు చేసి.. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఆయన నిర్ణయాల్ని ప్రకటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆయన పెద్ద ఎత్తున మంతనాలు జరపటంతో పాటు.. మేధోమధనం చేస్తుంటారు. ఏ విషయానికి ఆ విషయానికి ఆయన మంతనాలు జరిపే టీంలు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని ఆయనకు సన్నిహితంగా వ్యవహరించే కొందరు చెబుతుంటారు.
అలాంటి కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారా? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయించే విషయంలో ఆయన దూకుడుగా నిర్ణయం తీసుకున్నారా? పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో బండి సంజయ్ ను అరెస్టు చేసే విషయంలోనూ.. ఆ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైనా సరైన రీతిలో కసరత్తు జరగలేదన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
ప్రశ్నాపత్రం ఉదయం లీకైతే.. అర్ధరాత్రి వేళకు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని.. లోక్ సభ సభ్యుడ్ని అంత వేగంగా ఎలా అరెస్ట్ చేస్తారు?అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తోడు.. అత్తగారి దశదిన కర్మ కోసం వెళ్లిన వేళ.. అర్థరాత్రి పోలీసులు వచ్చేసి.. కారణం చెప్పకుండా అరెస్టు చేయటం ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన సందర్భంగా.. ఎమ్మెల్సీ కవిత సంధించిన ప్రశ్నలు.. ఫార్మాలిటీస్ గురించి పెద్ద ఎత్తున మీడియాలో రావటం.. ఒక ఎమ్మెల్సీని విచారించేందుకు ఇంత కసరత్తు చేయాల్సి ఉంటుందా? అన్న భావన కలిగేలా చేయటం తెలిసిందే.
అలాంటప్పుడు ఒక ఎంపీగా వ్యవహరిస్తూ.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను అలా ఎలా అరెస్టు చేస్తారన్న ప్రశ్న అంతకంతకూ సంధించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామంతో.. బండి సంజయ్ మీద సానుభూతి పెరగటంతో పాటు.. కేసీఆర్ అండ్ కో మీద విమర్శలు పెరుగుతాయన్న మాట వినిపిస్తోంది. తాజా పరిణామాల్ని చూసినప్పుడు ఏదో రకంగా బండి సంజయ్ ను అరెస్టు చేయాలన్న దూకుడు కనిపించిందే తప్పించి.. ఆయన తప్పు చేశారన్న భావన కలగటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాంటి కేసుల విషయంలో..తాము రాజకీయ ప్రతీకారంలో భాగంగా చర్యలు తీసుకోవటం లేదన్న సందేశాన్ని ప్రజలకు చేర్చాల్సి ఉంది. అందుకు భిన్నంగా.. బండి విషయంలో ప్రదర్శించిన దూకుడును పలువురు తప్పు పట్టే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు జరిగిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కేసీఆర్ అండ్ కో ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అలానే జరిగితే.. తన కుమార్తె విషయంలో ఇంత హడావుడి చేస్తున్న కేసీఆర్.. మిగిలిన వారి విషయంలో మరెందుకంత నిర్దయగా వ్యవహరించారన్న వాదన రావటం ఖాయమంటున్నారు. దూరంగా ఆలోచించి ఉంటే.. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై కేసీఆర్ ప్లానింగ్ వేరేగా ఉండేదన్న మాట వినిపిస్తోంది. బండికి షాకివ్వటం ద్వారా.. బీజేపీ అధినాయకత్వానికి కరకు సందేశాన్ని పంపాలన్న కేసీఆర్ ఆలోచన వర్కువుట్ అయ్యే అవకాశం తక్కువన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.