Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ఆ కులాన్ని అవమానించారా..!

By:  Tupaki Desk   |   10 Jun 2015 5:53 AM GMT
కేసీఆర్‌ ఆ కులాన్ని అవమానించారా..!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్రాజులు మండి పడుతున్నారు. ఆయన తమ కులాన్ని అవమానించారని అంటూ వారు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మేధావి లాంటి కేసీఆర్‌ కు ఇది తగదని వారు వ్యాఖ్యానించారు. తమ కులాన్ని కించపరిచినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరి భట్రాజు కులం వారికి ఉన్నట్టుండి తెలంగాణ సీఎంపై ఎందుకింత కోపం వచ్చింది? అంటే.. ఇటీవల కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఈ కులం పేరును ప్రస్తావించాడు. దీంతో ఆ కులస్తులకు కోపం వస్తోంది.

'మేమేమీ భట్రాజుల్లా పొగుడుకొని డబ్బా కొట్టుకొనేవాళ్లం కాదు...' అంటూ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని నోట్‌ చేసుకొని తెలంగాణ సీఎం తీరు పట్ల అభ్యంతరం చెబుతున్నారు భట్రాజులు.

నల్లగొండ జిల్లా బహిరంగ సభలో తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యానాలు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వారు అంటున్నారు. తమ కులాన్ని అవమానించడం ఏమిటని? కేసీఆర్‌లాంటి మేధావికి అది తగదని వారు అంటున్నారు.

మరి వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ సీఎం వారికి క్షమాపణలు చెబుతారా? లేక ఏదో ఫ్లోలో వచ్చిందంటూ లైట్‌ తీసుకొంటారా?!