Begin typing your search above and press return to search.

కూట‌మి ప‌రువు నిలిపిన జిల్లా!

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:06 AM GMT
కూట‌మి ప‌రువు నిలిపిన జిల్లా!
X
గెలుపులో వాటా ఇవ్వ‌రు కానీ ఓట‌మిలో మాత్రం అడ‌గ‌కుండా వాటా ఇవ్వ‌టం చాలామందికి అల‌వాటు. ఇందుకు టీఆర్ఎస్ అధినేత‌.. మ‌రో రోజు.. రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోబోనున్న కేసీఆర్ ఇందుకు మిన‌హాయింపు కాదు. తెలంగాణ వ్యాప్తంగా విజ‌య‌దుందుబి మోగించిన గులాబీ కారు స్టీరింగ్‌ ను ఆయ‌నే న‌డిపార‌న్న క్రెడిట్‌ ను సొంతం చేసుకున్నారు. మ‌రింత‌గా దూసుకెళ్లిన కారు.. ఖ‌మ్మం జిల్లాలోకి వ‌చ్చేస‌రికి స్పీడ్ తగ్గిపోవ‌ట‌మే కాదు.. బ్రేకుల‌తో ముందుకు వెళ్ల‌ని ప‌రిస్థితి.

తెలంగాణ రాష్ట్రంలోని పాత జిల్లాల్ని లెక్క‌లోకి తీసుకుంటే.. మిగిలిన తొమ్మిది జిల్లాల ఫ‌లితాలు ఒక‌లా ఉంటే.. ఖ‌మ్మం జిల్లాలో ఫ‌లితం మ‌రోలా ఉండ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మిగిలిన జిల్లాల‌కు భిన్నంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌జాఫ్రంట్‌ కు అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మొత్తం ప‌ది స్థానాల‌కు కేవ‌లం ఒక్క‌రు (ఖ‌మ్మం టీఆర్ ఎస్ అభ్య‌ర్థి పువ్వాడ అజ‌య్) మాత్ర‌మే విజ‌యం సాధించారు.

ఈ విజ‌యాన్ని కేసీఆర్ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. మిగిలిన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భిన్నంగా ఖ‌మ్మం ప్ర‌జ‌లు తీర్పు ఇవ్వ‌టం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. ఈ విష‌యానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌ని కేసీఆర్‌.. దీన్ని మూడు ముక్క‌ల్లో ముగించారు. త‌మ పార్టీకి చెందిన నేత‌ల త‌ప్పిదం వ‌ల్లే త‌మ‌వాళ్లు ఓడిపోయార‌ని.. తాను వారికి ఫోన్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఆ మాట‌కు వ‌స్తే.. గులాబీ నేత‌లు క‌డుపులో క‌త్తులు పెట్టుకొని ప‌ని చేసింది ఒక్క ఖ‌మ్మం జిల్లాలోనే కాదు.. చాలా జిల్లాల్లో ప‌ని చేశారు. కాకుంటే.. మ‌రెక్క‌డా రాని రీతిలో ఖ‌మ్మంలో తుది ఫ‌లితం రావ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మిగిలిన జిల్లాల్లో మాదిరి బాబు టూర్ పై నెగిటివ్ కంటే పాజిటివ్ క‌నిపించ‌టం ఒక ఎత్తు అయితే.. స్టార్ వాల్ట్స్ లాంటోళ్లు సైతం మ‌ట్టి క‌ర‌వ‌టం విశేషం.

త‌న మేజిక్ తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నార‌న్న కేసీఆర్‌.. ఖ‌మ్మంలో మాత్రం అలాంటిదేమీ ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయార‌న్న‌ది చెప్ప‌క త‌ప్ప‌దు. ఖ‌మ్మం జిల్లాలో వ‌చ్చిన సీట్ల‌తో కూట‌మి ప‌రువు నిలిచింద‌ని చెప్పాలి. ఇక్క‌డ ఎవ‌రూ చెప్ప‌ని మ‌రో విష‌యం ఏమంటే.. మిగిలిన జిల్లాల్లోనూ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఉన్నా టీఆర్ ఎస్ అద్భుత‌మైన మెజార్టీ సాధించిన టీఆర్ ఎస్‌.. ఖ‌మ్మంలో మాత్రం అలాంటిదేమీ ఎందుకు చేయ‌లేక‌పోయింద‌న్న‌ది ఇప్పుడు బిగ్ క్వ‌శ్చ‌న్ గా మారిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.