Begin typing your search above and press return to search.

టీఎస్ ఆర్టీసీ సమ్మె : వీలైతే వి ఆర్ ఎస్ లేదంటే సి ఆర్ ఎస్ !

By:  Tupaki Desk   |   27 Nov 2019 10:09 AM GMT
టీఎస్ ఆర్టీసీ సమ్మె : వీలైతే వి ఆర్ ఎస్ లేదంటే సి ఆర్ ఎస్ !
X
తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండలా తయారైన ఆర్టీసీ సమస్యకి ఒక ముగింపు తెచ్చేందుకు కేసీఆర్ నాయకత్వంలో సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. ఆర్టీసీ సమ్మె పైనే చర్చించడానికి కేసీఆర్ క్యాబినెట్ ఈ నెల 28 న భేటీ కాబోతున్నారు. దీనితో ఆర్టీసీ పై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టేనా? ఎంతమందిని తొలగించబోతున్నారు ? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్యాబినెట్ భేటీ తరువాత ఆర్టీసీ భవిష్యత్ పై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది.

ఎలాగూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కి దిగి ..వెనక్కి వచ్చారు కాబట్టి ..ఇదే అదునుగా భావించి ఆర్టీసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. దాదాపుగా 5 వేల కోట్లకి పైగా అప్పులు ఉన్న తెలంగాణ ఆర్టీసీ ని ఇప్పుడు నడపడం సాధ్యం కాదని భావించిన సర్కార్ 50 శాతం ఆర్టీసి యాజమాన్యం మరో 50 శాతం ప్రైవేటు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ..రాష్ట్రంలో 5100 రూట్లని ప్రైవేటు వారికి అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా ..హైకోర్టు కూడా మంత్రివర్గ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణ విధివిధానాలు ఖరారు మాత్రమే మిగిలింది.

ఇకపొతే రాష్ట్రంలోని సగం రోడ్లని ఎలాగూ ప్రవైట్ పరం చేస్తుండటం తో ఆర్టీసీ కార్మికులని సగానికి పైగా తొలగించాలని ఆలోచిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులకి వి ఆర్ ఎస్ లేదంటే సి ఆర్ ఎస్ పథకాన్ని అమలు చేయాలనీ చూస్తుంది. వి ఆర్ ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ అదే సి ఆర్ ఎస్ అంటే తప్పనిసరి పదవీ విరమణ 50 ఏళ్లు పైబడిన ఆర్టీసీ ఉద్యోగులు అందరిని ఈ రెండింటిలో ఏదో ఒక పథకం కింద ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే అందరు వి ఆర్ ఎస్ తీసుకుంటే భారీ మొత్తంలో కార్మికులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో ఎక్కువమందిని సిఆర్ ఎస్ ద్వారా ఇంటికి పంపించాలని చూస్తున్నట్టు సమాచారం.

దీనికోసం కోసం ఆర్టీసీలో 50 ఏళ్ల పైబడిన ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 వేల మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దేశంలో అమలైన అమలవుతున్న ముందస్తు పదవీ విరమణ పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ రవాణా అధికారులను ఆదేశించారు. అలాగే వి ఆర్ ఎస్ - సి ఆర్ ఎస్ పోగా మిగిలిన వారిని ప్రత్యేకమైన షరతులతో కూడిన హామీ పత్రం పై సంతకం చేయించుకొన్న తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది కూడా .. ఇప్పటికిప్పుడు కాకుండా కొన్ని రోజుల తరువాత అమలు చేయాలనీ చూస్తున్నట్టు సమాచారం. అలాగే ఆర్టీసీ ఆస్తుల పైన కూడా ఈ క్యాబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.