Begin typing your search above and press return to search.

న‌మ్మిన దైవం విష‌యంలో కేసీఆర్ అలా చేయ‌ట‌మా?

By:  Tupaki Desk   |   28 May 2019 8:22 AM GMT
న‌మ్మిన దైవం విష‌యంలో కేసీఆర్ అలా చేయ‌ట‌మా?
X
ఈ రోజు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి. ప్ర‌తి ఏడాది ఎన్టీఆర్ జ‌యంతి.. వ‌ర్థంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ను స‌ర్వాంగ సుంద‌రంగా అల‌క‌రించ‌టం ఎప్ప‌టినుంచో ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఎన్టీఆర్ ను విప‌రీతంగా అభిమానించి.. ఆరాధించ‌ట‌మే కాదు.. త‌న కొడుకు పేరును త‌న అభిమాన నాయ‌కుడి పేరును పెట్టుకోవ‌టం చూస్తే.. ఎన్టీవోడిని కేసీఆర్ ఎంత‌లా ఇష్ట‌ప‌డేవాడో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌రి.. అలాంటి వ్య‌క్తి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న వేళ‌.. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్ ను అందంగా అలంక‌రించే విష‌యంలో నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ విష‌యంలో త‌ప్పు మీదంటే మీద‌న్న ఆరోప‌ణ‌లు.. ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్న ప‌రిస్థితి. అస‌లేం జ‌రిగింద‌న్నది చూస్తే.. ఎన్టీఆర్ ఘాట్ ను లెక్క ప్రకారం హెచ్ ఎండీఏ ప్రోటోకాల్ సిబ్బంది అలంక‌రించాల్సిన బాధ్య‌త ఉంది. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ టీడీపీ నేత‌లు ప్రోటోకాల్ అధికారుల‌కు లేఖ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

స‌మ‌న్వ‌య లోప‌మో.. మ‌రేదైనా కార‌ణం కానీ.. అధికారులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అలంక‌ర‌ణ విష‌యంలో నిర్ల‌క్ష్యం చేశారు. పొద్దు పొద్దున్నే తాత‌కు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వ‌చ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అలియాస్ తార‌క్ లు షాక్ తిన్నారు. జ‌యంతి సంద‌ర్భంగా ఎలాంటి ఏర్పాట్లు లేక‌పోవ‌ట‌మే కాదు.. క‌నీసం పూలు కూడా లేక‌పోవ‌టంపై ఆవేద‌న‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వెనువెంట‌నే పూలు తేవాల‌ని ఆదేశించ‌టంతో పెద్ద ఎత్తున పూలు వ‌చ్చేశాయి. తానే స్వ‌యంగా అలంక‌రించారు. ఎన్టీఆర్ ఘాట్ ఏర్పాట్ల‌ను ఇక‌పై తానే చూసుకుంటాన‌ని ఆయ‌న తేల్చేశారు. తార‌క్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే తెలుగుదేశం పార్టీ ఉలిక్కిప‌డింది. తాము అధికారుల‌కు లేఖ‌ను ఇచ్చామ‌ని.. కానీ వారు ప‌ట్టించుకోలేద‌ని స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఇక్క‌డో విష‌యాన్ని చెప్పాలి. ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన ఆయ‌న శిష్యుడు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలాంటివి చోటు చేసుకోవ‌టాన్ని ఆయ‌న కూడా సీరియ‌స్ కావాల్సిన అవ‌స‌రం ఉంది.

కేసీఆర్ తోపాటు.. తెలుగుదేశం పార్టీ.. నంద‌మూరి కుటుంబ స‌భ్యులు ఇలా ఎంతోమంది ఉన్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌టం చూస్తే.. రాజుగారి పాల పాత్ర సామెత గుర్తుకు రాక మాన‌దు. ఎవ‌రికి వారు.. వారు చూసుకుంటారన్న భ‌రోసా.. చివ‌ర‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితికికార‌ణ‌మైంది. ఏమైనా.. ఎన్టీఆర్ వీరాభిమానులు.. ఆయ‌న సొంతోళ్ల కార‌ణంగానే ఎన్టీఆర్ ఘాట్ లో జ‌యంతి ఏర్పాట్లు చేయ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.