Begin typing your search above and press return to search.

కవితను ఓడిస్తారా? కేసీఆర్ ప్రతీకారం..

By:  Tupaki Desk   |   27 July 2019 5:38 AM GMT
కవితను ఓడిస్తారా? కేసీఆర్ ప్రతీకారం..
X
లాలించాడు.. బుజ్జగించాడు. అయినా మాట వినలేదు.. ఇప్పుడు కౌంటర్ అటాక్స్ మొదలు పెట్టాడు.. తనకు ఓటేసిన జనాలను కాపాడుకోవడం ఎలానో కేసీఆర్ కు బాగా తెలుసు. అలానే కాలదన్నిన వారిని ఎలా డీల్ చేయాలో కూడా కేసీఆర్ కు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదంటారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పుడు తన కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారట కేసీఆర్. అందుకోసం చర్యలు చేపట్టారట. దీంతో కవితపై గెలిచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయన్న టాక్ ఆ జిల్లా వర్గాల్లో వినిపిస్తోంది.

తెలంగాణనే ఏలుతున్న ఆసామి కేసీఆర్. తెలంగాణ మొత్తం గెలిచి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ కే షాకిచ్చారు నిజామాబాద్ రైతులు. ఆయన కూతురును చిత్తుగా ఓడించారు. ఈ ఓటమి మనస్థాపానికి కవిత బయటకే రావడం లేదు.. పసుపు - ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర - పసుపు బోర్డు ఏర్పాటు తదితర హామీల కోసం కూటమి గట్టి కవితపై రైతులు పోటీచేసి ఓడించారు. అది తమ పరిధిలో లేదని.. కేంద్రం చేయాలని కేసీఆర్ ఎంత బుజ్జగించినా రైతులు మాట వినకుండా బీజేపీని ఇక్కడ గెలిపించారు. ఆ రైతుల వెనుక బీజేపీ హస్తం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది.

సరే బీజేపీ గెలిచింది.. కవిత ఓడింది. వారు హామీనిచ్చిన పసుపు బోర్డు - గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా అరవింద్ పై పడింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఆయన తన పరపతితో కేంద్రంలోని వ్యవసాయ శాఖ అధికారులతో భేటి అయ్యారు. నిజామాబాద్ రైతు నేతలను తన వెంట తీసుకొని వెళ్లి కలిశారట.. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు అధికారులు.

పసుపు బోర్డు సహా గిట్టుబాటు ధర - చక్కెర ఫ్యాక్టరీ ఇలా నిజామాబాద్ రైతుల పెండింగ్ సమస్యలను తీర్చాలంటే తెలంగాణ సర్కారు సహకారం అవసరమని అధికారులు తేల్చిచెప్పారట.. కానీ కేసీఆర్ ఈ విషయంలో అసలు పట్టించుకోవడం లేదని కేంద్రంలోని అధికారులు చెప్పారట.. దీంతో షాక్ తినడం నిజామాబాద్ ఎంపీ అరవింద్ - రైతు నేతల పనైంది. బోర్డులకు - ఫ్యాక్టరీలకు కేంద్రం కొంత సబ్సిడీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం భూమి - నీరు - కొన్ని నిధులు భరించి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయం సూచించినా కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదట.. తన కూతురు కవితను ఓడించిన బీజేపీ ఎంపీ అరవింద్ - రైతుల కోరికలను కేసీఆర్ చెత్తబుట్టలో పడేస్తున్నాడట... అందుకే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ - ఎదురు తిరిగిన రైతులకు కేసీఆర్ ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నాడట.. కేంద్రం ద్వారా నరుక్కువద్దామని చూసిన నిజామాబాద్ ఎంపీకి రాష్ట్ర సహకారం లేకుండా ఏమీ చేయలేని స్థితిని కల్పిస్తున్నాడట కేసీఆర్.

ఇలా రైతుల ముందు నిజామాబాద్ ఎంపీని డమ్మీని చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారట కేసీఆర్.. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని చక్కరె - ఇతర ఫ్యాక్టరీలను పునరుద్దరించమని .. అమ్ముకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఇప్పుడు పసుపు బోర్డు - ఇతర రైతుల హామీలకు కేసీఆర్ మోకాలడ్డుతుండడం చర్చనీయాంశంగా మారింది. కవితను ఓడించిన వారికే ఇదే శాస్తి చేస్తున్నాడన్న ప్రచారం జిల్లాలో సాగుతోంది.