Begin typing your search above and press return to search.
ఆ గ్రామంపై సీఎం వరాల జల్లు... అభివృద్ధే లక్ష్యం
By: Tupaki Desk | 14 Aug 2019 5:02 PM GMTతెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. ఇటీవల తన సొంత గ్రామం చింతమడక అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్.. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి దశదిన కర్మకు కేసీఆర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక కేసీఆర్ - ప్రగతి సింగారం గ్రామం గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడున్న సమస్యలు తెలుసుకున్న కేసీఆర్ వెంటనే రూ. 10 కోట్లు మజూరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ నిధులతో గ్రామంలో రహదారులు - డ్రైనేజీ క్లీనింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు - విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కాగా, ఇటీవల చింతమడకలోని ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే, చింతమడక నుంచి రాష్ట్ర ఆరోగ్య సూచీ (హెల్త్ ఇండెక్స్) తయారు చేయనున్నారు. చింతమడకలో అర్జంటుగా పూర్తి కావలసిన రోడ్లుని పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. ఇక తాజాగా ప్రగతి సింగారానికి వచ్చిన ఆయన ఈ గ్రామ ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా వరాల జల్లు కురపించారు.
స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పరామర్శించిన అనంతరం గ్రామ అభివృద్ధిపై ధర్మారెడ్డితో చర్చించారు. సీఎం కేసీఆర్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - మాజీ స్పీకర్ మధుసూదనచారి తదితరులు ఉన్నారు.