Begin typing your search above and press return to search.

గుత్తాకు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న గులాబీ అధినేత‌!

By:  Tupaki Desk   |   27 May 2019 8:23 AM GMT
గుత్తాకు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న గులాబీ అధినేత‌!
X
గులాబీ బాస్ తిరుప‌తి టూర్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య‌న పుణ్య‌క్షేత్రాల్ని వ‌రుస పెట్టి తిరిగి వ‌స్తున్న కేసీఆర్ అండ్ ఫ్యామిలీ.. తాజాగా తిరుప‌తి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యాక మూడేళ్ల‌కు తిరుమ‌ల‌కు వ‌చ్చిన ఆయ‌న రెండేళ్ల వ్య‌వ‌ధిలో మ‌రోసారి తిరుమ‌ల‌కు వ‌చ్చారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్న ఆయ‌న‌.. ఈ మ‌ధ్యాహ్నానానికి హైద‌రాబాద్‌ కు చేరుకోనున్నారు.

ఆయ‌న హైద‌రాబాద్ కు వ‌చ్చిన త‌ర్వాత టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి శుభ‌వార్త చెబుతార‌న్న వార్త బ‌లంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా గుత్తాను ఎంపిక చేశార‌ని.. ఆ విష‌యాన్ని గులాబీ బాస్ వెల్ల‌డించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. నవంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మైనంప‌ల్లి మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని గుత్తాతో భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

తొలుత గుత్తాను న‌ల్గొండ ఎంపీ స్థానానికి ఎంపిక చేయాల‌ని భావించినా.. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు కేసీఆర్‌. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో గుత్తాను ఎమ్మెల్సీని చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ని.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి వ‌చ్చి కారెక్కిన గుత్తాకు తాజాగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన త‌ర్వాత‌.. త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ని.. ఇందుకు సంబంధించి మొద‌టి అడుగు ఈ రోజు సాయంత్రం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌మోష‌న్ కోసం ఎదురుచూస్తున్న గుత్తాకు ఇది నిజంగానే స్వీట్ న్యూస్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.