Begin typing your search above and press return to search.
డామిట్..సారు లెక్క మళ్లీ తప్పింది
By: Tupaki Desk | 19 April 2020 5:40 AM GMTదేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రూటు కాస్త సపరేటు. పావలా పనికి రూపాయి పావలా ప్రచారం చేసుకోవటంలో సారుకున్న నేర్పు చాలామంది సీఎంలకు లేదనే చెప్పాలి. కరోనా ఎపిసోడ్ లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి ప్రధానమంత్రి మోడీకే సలహాలు ఇచ్చే టాలెంట్ ఆయన సొంతం. కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. లాక్ డౌన్ ను కొనసాగించటం మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని తొలుత చెప్పింది కేసీఆరే. అంతేకాదు.. లాక్ డౌన్ తో వచ్చే ప్రయోజనాల్ని ఏకరువు పెట్టారు. ఆయన చెప్పినట్లే.. లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కారు.
కేంద్రానికే ఐడియాలు ఇచ్చే మేధస్సు ఉన్న కేసీఆర్.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో కరోనా కేసుల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే.. ముందస్తుగానే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రయోజనం మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినా.. అనుకోని రీతిలో వచ్చి పడిన మర్కజ్ వ్యవహారంతో తెలంగాణ పెద్ద ఎత్తున ప్రభావితమైంది.
మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించే విషయంలో చురుకుదనం ప్రదర్శించినప్పటికీ.. వారి నుంచి వివరాలు రాబట్టటం.. వారి కారణంగా కనెక్టు అయిన వారిని గుర్తించే విషయంలో దొర్లిన తప్పులు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. అధికారులు చెబుతున్న లెక్కలకు.. వాస్తవాలకు పొంతన లేకపోవటంపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. మర్కజ్ ఎపిసోడ్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడించిన సీఎం కేసీఆర్.. వారి కాంటాక్టును పెద్ద ఎత్తున గుర్తించిన క్వారంటైన్ చేసినట్లుగా చెప్పారు.
అంతేకాదు.. ఏప్రిల్ 25 నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేవుడు దయ తలిస్తే.. మర్కజ్ లాంటివి మళ్లీ చోటు చేసుకోకుంటే.. కరోనా కేసుల్ని కంట్రోల్ చేయటం పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చారు. సారు చెప్పిన డేట్ కు కేవలం ఆరు రోజుల దగ్గరకు వచ్చేసినా.. కేసుల నమోదు తీవత్ర తగ్గకపోగా.. రోజు రోజుకు కొత్త కేసుల నమోదు ఆందోళన కలిగిస్తోంది. మేధావి సీఎంగా ఇమేజ్ ఉన్న కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా కేసుల్ని ఎందుకు తగ్గించలేకపోతున్నారన్నది ప్రశ్న.
దీనికి సమాధానం వెతికితే.. కరోనా మీద కేసీఆర్ విజన్ బాగానే ఉన్నా.. దాన్ని కట్టడి చేసే వ్యూహాన్ని అమలు చేయటంలో అధికారగణం చేస్తున్న తప్పులు.. పొరపాట్లే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో చేసిన పనిని ఎక్కువ చేసి చెప్పుకోవటం అంతకంతకూ పెరుగుతోంది. ఇది కూడా.. పనులు మందకొడిగా సాగటానికి కారణంగా చెప్పాలి. తాను చెబుతున్న లెక్కలు వరుస పెట్టి ఫెయిల్ అవుతున్న వేళ.. కేసీఆర్ ఇరిటేట్ కావటం ఖాయం. ఇలాంటి పరిస్థితి మళ్లీ మళ్లీ ఎదురుకాకుండా ఉండాలంటే.. అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. ఎవరూ ఎక్కువ కాదు.. మరెవరూ తక్కువ కాదన్నట్లుగా పని చేస్తే.. పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుందని చెప్పక తప్పదు.