Begin typing your search above and press return to search.
మోడీకి మత పిచ్చి...బాబును తరిమికొట్టండి
By: Tupaki Desk | 23 Nov 2018 4:23 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోమారు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు విరుచుకుపడ్డారు. ఇటు రాష్ట్రం అటు ఉద్యమం సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఇద్దరు నేతలపై ఆక్షేపించారు. తెలంగాణ కోసం ఏవిధంగానైతే పోరాడామో..అదే విధంగా పోరాడి రిజర్వేషన్లను సాధించిపెడతానని కేసీఆర్ హామీనిచ్చారు. ``మా తండాలలో మా రాజ్యం కావాలని అడిగితే ఏ ప్రభుత్వం చేయలేదు. రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసినం. శాసనసభలో ఆమోదించినం. రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీకి మతపరమైన పిచ్చి ఉంది. ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్ల అంశాన్ని కూడా పెండింగ్ పెట్టారు`` అని ఆరోపించారు. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే సాధించి తీరుతాడని - తద్వారా రిజర్వేషన్లు దక్కుతాయని అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా - బీజేపీ వచ్చినా..దొందూదొందేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. `` ఆ రెండు పార్టీల్లో ఏం తేడా ఉండదు. అధికారాలన్నీ వారి చేతిలో ఉండి..రాష్ర్టాల మీద కర్ర పెత్తనం చలాయించే సంస్కృతి వాళ్లది. ప్రజల కోరికలు నెరవేరాలే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం నడవాలంటే..ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ప్రభుత్వం రావాలి` అని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలు మొత్తం గెలిచి - ఢిల్లీలో పోరాటం చేసే పరిస్థితి ఉండాలని, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆ అధికారం చేస్తే వందకు వందశాతం ఎస్టీ రిజర్వేషన్ తెచ్చి ఇచ్చే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ``ఒక వైపు రాష్ర్టాన్ని సాధించి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఉంది. మరోవైపు 58ఏళ్లు పాలించిన కాంగ్రెస్ - టీడీపీ ఉన్నాయి. టీఆర్ ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ - టీడీపీలు ఏం చేశాయో ప్రజలకు తెలుసనని దాన్ని గుర్తు ఉంచుకొని ఓటువేయాలి` అని అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులు వద్దని చంద్రబాబు లేఖలు రాశారని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ``కాంగ్రెస్ వాళ్ల బాసులు ఢిల్లీ - టీడీపీ వాళ్ల బాసులు అమరావతిలో ఉన్నారు. కానీ మా బాసులు మాత్రం మీరేనని.. తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం అవసరమా? హైకోర్టు విభజన కానీయడు.. ఆస్తుల పంపకాలు కానీయడు.. ప్రాజెక్టులకు వ్యతిరేకమే.. నా వంతుకు నేను తరిమికొట్టినా.. ఇప్పుడు మీ వంతు. చంద్రబాబును - ఆయనను మోసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్లను ఓటుతో దెబ్బకొట్టాలి` అని సీఎం పిలుపునిచ్చారు.