Begin typing your search above and press return to search.

కేసీఆర్ గ‌తంలోకి వెళ్లిపోతే...ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   26 Oct 2017 5:14 PM GMT
కేసీఆర్ గ‌తంలోకి వెళ్లిపోతే...ఇలా ఉంటుంది
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చ‌ట చెప్ప‌డం అంటూ మొదలు పెడితే...అది ఎంత ఆస‌క్తిక‌రంగా - సుదీర్ఘంగా - ప్ర‌త్యేకంగా ఉంటుందో మ‌ళ్లీ చెప్ప‌క్క‌ర్లేదు. బ‌హిరంగ స‌భ‌ల్లోనే కేసీఆర్ స్పీచ్ అదిరిపోతుంది...ఇక కొంత మందితో చ‌ర్చిస్తే...కేసీఆర్ ఎన్నో భావాలు పంచుకుంటారు. అలాంటి అనుభ‌వం తాజాగా అసెంబ్లీ సాక్షిగా జ‌రిగింది..అందులోనూ కేసీఆర్ త‌న గ‌త అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ - శాసన మండలి సమావేశాల నేప‌థ్యంలో బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ (బీఏసీ) శాస‌న‌మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ అధ్యక్షత‌న నిర్వహించారు. సీఎం కేసీఆర -, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి - మహమూద్ ఆలీ - శాసనసభా వ్యవహారాల‌ మంత్రి హరీశ్‌ రావు - ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ - మండలి ప్రధాన ప్రతిపక్షనేత ష‌బ్బీర్‌ ఆలీ - ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి - బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు - ప్ర‌భుత్వ విప్‌ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి - పాతూరి సుధాకర్ రెడ్డి - కర్నె ప్రభాకర్ - బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మండలి బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తాను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న రోజుల్లో శాసనమండలి సమావేశాల తీరును ప్రశంసించారు. అప్పట్లో మండలిలో అర్థ‌వంతమైన చర్చలు జరిగేవని చెప్పారు. 1978-80 ప్రాంతాల్లో మండలి చర్చల్లో జూపూడి యజ్ఞనారాయణ - మానిక్ రావు - కే.కేశవరావులు ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహ‌న‌తో వివిధ చర్చల్లో పాల్గొనేవారని.. ప్రభుత్వం వారిచ్చే నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు హుందాగా స్వీకరించేదని వివరిస్తూ, కొన్ని సందర్బార్లో వారి లోతైన అవగాహన‌కు అధికార పక్షంతో పాటు సభ్యులు, మండలి సందర్శకులు ముగ్ధులు అయ్యేవారన్నారు.

తాము చ‌ర్చ‌ల‌ను గ‌మ‌నించిన స‌మ‌యంలో కొన్ని సందర్భాల్లో అధికార పక్ష కూడా ఇరుకున పడేదని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పుడప్పుడు మంత్రులు మండలికి వచ్చి సమాధాలిచ్చేందుకు వెనుకాడేవారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా శాసన సభతో పోల్చితే మండలిలో ఎలాంటి అంతరాయాలు...అవాంతరాలు లేకుండా సాఫీగా చర్చలు సాగుతున్నాయని..ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయ పడగా..మిగతా వారంగా ఆయనతో ఏకీభవించారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా అర్థ‌వంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నామని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు - కార్యక్రమాలు - ప్రజలెదుర్కుంటున్న తక్షణ సమస్యలగూర్చి చర్చిస్తే నేను కూడా సభకు క్రమం తప్పకుండా హాజరవుతానని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే శాసన సభలో చర్చకొచ్చే అంశం అదే రోజు మండలిలో ఎజెండాలో చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.