Begin typing your search above and press return to search.
ఓట్ల కోసం మరో స్కెచ్
By: Tupaki Desk | 3 Dec 2015 3:59 PM GMTప్రజాస్వామ్యం అంటే చట్టం నిర్దేశించిన రీతిలో వ్యవహరించడం. ప్రభుత్వం కల్పిస్తున్న సేవలు - సౌలభ్యాలు ఉపయోగించుకుంటూ అందుకు తగిన మొత్తాన్ని చెల్లించడం. తద్వారా దేశ ఖజానాను పరిపుష్టం చేసి మనమంతా సమష్టిగా అభివృద్ధి చెందడం. కానీ కాలం మారింది. భారతీయ పౌరుడిగా ఉన్నందుకు పద్దతిగా ఉండాలని చెప్పాల్సిన పాలకులే మనలో స్వార్థపు ఆలోచనలకు బీజం వేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే....గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ - తాగు నీటి బకాయిలు మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ - పద్మారావు - జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ - నీటి బకాయిల రద్దుపై చర్చించారు. విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.128 కోట్లు, తాగు నీటి బకాయిలు రూ.290 కోట్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో దాదాపు 420 కోట్ల రూపాయల బిల్లులను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు! ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బకాయిల మాఫీపై ఉత్తర్వులు జారీ చేయలేమని, కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు!! బకాయిల మాఫీతో 6 లక్షల మంది గృహ వినియోగదారులు, 3 లక్షల మంది తాగు నీటి వినియోగదారులు లబ్ధి పొందనున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఓట్లు సంపాదించుకునేందుకే ఈ నిర్ణయమనేది జగమెరిగిన సత్యం. బిల్లుల మాఫీ ద్వారా లాభం చేకూరే వారి సంఖ్య బాగానే ఉన్నా న్యాయంగా బిల్లులు చెల్లించుకుంటూ పోయిన వారికి మిగిలేదేంటి అనేది అత్యంత సహజంగానే కలిగే ప్రశ్న. గత ఎన్నికల సమయంలో రుణమాఫీకి తెరతీసి వేలకోట్ల రూపాయాల భారాన్ని ప్రభుత్వం ప్రజలందరిపై మోపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి మాఫీల ద్వారా కొందరికే దక్కుతుందనేది ఎంత నిజమో...భారం అందరిపై పడుతుందనేది అంతే చేదు నిజం. ప్రతి ఎన్నికల సమయంలో ఈ తరహా మాఫీ మజాను అందిస్తారని ప్రజలు గ్రహిస్తే.... ఆర్థికంగా ప్రభుత్వంపై తడిసిమోపెడు అయ్యే రీతిలో బకాయిలు పేరుకుపోవడం ఖాయం. మాఫీ సరైనది కాదనేది ఉద్దేశం కానప్పటికీ... డబ్బులు కట్టలేని వారికి ఆ అవకాశం ఇవ్వాలే తప్ప డబ్బులు కట్టకుండా ఉండేందుకు ప్రభుత్వమే రాచబాట వేయవద్దనేది సామాన్యుల ఆకాంక్ష.