Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఇప్పుడు అన్నీ గుర్తు కు వ‌స్తాయ్‌: పొంగులేటి స‌టైర్లు

By:  Tupaki Desk   |   28 May 2023 9:00 PM GMT
కేసీఆర్‌ కు ఇప్పుడు అన్నీ గుర్తు కు వ‌స్తాయ్‌:  పొంగులేటి స‌టైర్లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఇప్పుడు అన్నీ గుర్తుకు వ‌స్తాయ‌ని, అంద‌రూ గుర్తుకు వ‌స్తార‌ని బీఆర్ ఎస్ బ‌హిష్కృత నాయ‌కుడు, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తరతరాలుగా పోడు సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనుల పై కేసులు పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించిన పోడురైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ కు ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తొస్తారని, తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఒక్క గిరిజనులే కాకుండా.. అన్ని పార్టీల్లో ని అంద‌రు నేత‌లుకూడా ఇప్పుడు ఆయ‌న‌కు వ‌రుస పెట్టి గుర్తు కు వ‌స్తార‌న్నారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఇప్పుడు ఆయ‌న‌కు గుర్తుకు వ‌స్తార‌ని తెలిపారు. పోడు రైతులకు దగ్గరుండి పట్టాలిప్పిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం.. నేటికీ దానిని నెరవేర్చలేదన్నారు.

నాలుగున్న రేళ్లు గడుస్తున్నా సెంటు పోడు భూమికి కూడా పట్టా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన పోడు ఘర్షణల్లో అనేకమంది గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేశారని, పోడు పోరులో కొందరు చనిపోయారని గుర్తు చేశారు. వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గిరిజనుల పై ఉన్న కేసులు ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.

13 లక్షల ఎకరాల పోడు భూముల కోసం 4.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దాంట్లో 3 లక్షల కుటుంబాలకు 11 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని గతేడాది డిసెంబర్‌ లో సీఎం ప్రకటించారని, కానీ ఇప్పుడు 1.50 లక్షల మందే అర్హులని, సుమారు 4 లక్షల ఎకరాలే ఇస్తామని చెబుతుండటం హాస్యాస్ప దమన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ కు బుద్ధి చెప్పాల‌ని.. ఆయ‌న జీవితాంతం.. ఈ తొమ్మిదేళ్ల పాల‌న‌ను మాత్ర‌మే గుర్తుంచుకునేలా చేస్తామ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.