Begin typing your search above and press return to search.

ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్‌ ది నో రియాక్షన్‌!

By:  Tupaki Desk   |   8 April 2015 4:44 AM GMT
ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్‌ ది నో రియాక్షన్‌!
X
సిమి కార్యకర్తల ఎన్‌కౌంటర్‌ అంశం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి స్టాండు ఏమిటి? ఆయన ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల అసంతృప్తితో ఉన్నాడా? పోలీసులు ఇలా చేయాల్సింది కాదనే అభిప్రాయంతో ఉన్నాడా? ఈ ఎన్‌కౌంటర్‌ గురించి ఆయనకు ముందస్తు సమాచారం ఏదీలేదా? అసలు ఈ ఎన్‌కౌంటర్‌ను మీడియా ముందు సమర్థించలేకే కేసీఆర్‌ మొహం చాటేశాడా? అనే సందేహాలు జనిస్తున్నాయిప్పడు.

సాధారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడతాడు. అయితే మంగళవారం మాత్రం ఆయన ఈ పని చేయలేదు. ఒకవైపు సిమి కార్యకర్తల ఎన్‌కౌంటర్‌ గురించి టీవీల్లో, జనాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ మీడియా ముందుకు రాలేదు.

ఈ ఎన్‌కౌంటర్‌ను కేసీఆర్‌ సమర్థించనూ లేకపోతున్నాడు.. అలాగని ఖండించనూ లేకపోతున్నాడు. తమ సహచరుడు చనిపోయిన బాధలో ఉన్నారు పోలీసులు.. ఈ నేపథ్యంలో వారు సిమిని ఏదో విధంగా గట్టి దెబ్బ కొట్టేవంత వరకూ శాంతించలేరు. ఇదే సమయంలో వికారుద్దీన్‌ గ్యాంగ్‌ ఎదురు తిరగడంతో వారి ఆగ్రహం పతాకస్థాయికి చేరింది.

వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌ఫై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎమ్‌ వంటి పార్టీలు దీనిపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ ఈ ఎన్‌కౌంటర్‌ గురించి బాహాటంగా చర్చించలేని పరిస్థితి ఉంది. దీన్ని గట్టిగాసమర్థిస్తే ఒకవర్గం ఓటు బ్యాంకు దూరంఅవుతుందని కేసీఆర్‌ భయపడి ఉండొచ్చు!

అందుకే ఆయన ఈ ఉదంతంలో ప్రత్యక్షంగా స్పందించలేదు. చనిపోయిన పోలీసులకు నివాళిఘటిస్తూ ప్రకటన విడుదల చేసి.. ఎన్‌కౌంటర్‌ మీద మాత్రం మారు మాట్లాడలేదు. మీడియాకు మొహం చాటేసి కేసీఆర్‌ ఈ సంఘటనపై రియాక్ట్‌ కావాల్సిన అవసరాన్ని కూడా లేకుండా చేసుకొన్నట్టున్నాడు.