Begin typing your search above and press return to search.
చిన్నమ్మను అలా మర్చిపోయారేంటి కేసీఆర్!
By: Tupaki Desk | 7 Aug 2019 8:26 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం ఎంత తీవ్రమైనదన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఎంతోమంది బలిదానాలకు సైతం వెనకడుగు వేయలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుగు ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని పలువురు తమ వాణిని వినిపించారు. అలా వినిపించిన అతి కొద్దిమందిలో అగ్ర తాంబూలం మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ కే చెల్లుతుందని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని పార్లమెంటు వేదిక మీద బలంగా వినిపించటమే కాదు.. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆశల్ని.. ఆకాంక్షల్ని ఆమె వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మ కీలకంగా వ్యవహరించటమే కాదు.. అవసరమైన సమయంలో అవసరానికి మించిన సాయాన్ని అందించారు.
మరి.. అలాంటి సుష్మ అకాల మరణం చెందినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తపించిన నేత మరణించినప్పుడు.. సెలవు ప్రకటించటంతో పాటు.. సంతాప దినాల్ని ప్రకటించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. సుష్మా లాంటి నేతలు అతి తక్కువ మంది ఉంటారని.. వారిని.. తెలంగాణ ఏర్పాటులో ఆమె పోషించిన పాత్రను తెలంగాణ ప్రజలు ఎంతలా గుర్తుంచుకున్నారన్న విషయాన్ని చెప్పాల్సిన సమయంలో కేసీఆర్ ఆ తరహాలో నిర్ణయం తీసుకోకపోవటాన్ని తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన సుష్మకు ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం లేదా?