Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ కు భరోసానివ్వని రైతుబంధు..
By: Tupaki Desk | 9 Jun 2018 11:05 AM GMTతాజాగా తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మీద కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలోని రైతులందరికీ లబ్ధి చేకూర్చే ఈ పథకమే వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్ల వాన కురిపిస్తుందని ఆశపడ్డారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడు పరిస్థితి చూశాక ఆ పథకం టీఆర్ ఎస్ కు ఆశించిన మైలేజీని అందించలేదని రిపోర్టు రావడం కేసీఆర్ ను నివ్వెరపరిచింది. ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్న కేసీఆర్ ఈ పథకం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం.
రైతు బంధు ద్వారా రైతుల్లో ఎంత సంతోషం అయితే వ్యక్తమవుతుందో.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వల్ల టీఆర్ ఎస్ కు అంతే స్థాయిలో డ్యామేజ్ జరుగుతోందని కేసీఆర్ కు నివేదికలు వచ్చాయి. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని.. 2014లో టికెట్లు పొందిన వీరికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడే అవకాశాలు లేవని రిపోర్టు వచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం టీఆర్ ఎస్ కు 90మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 36మంది ఖచ్చితంగా గెలవరని సర్వే తేల్చింది. 40 నుంచి 50మంది ఎమ్మెల్యేలు బాగా కష్టపడుతున్నారని.. వారు మళ్లీ గెలుస్తారని నివేదిక తేల్చింది.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. కానీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల వల్ల ఆ మార్కును అందుకోవడం కష్టమని తేలుతోంది.
ఈ తాజా నివేదిక వచ్చాక సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చినట్టు వచ్చే ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడే ఆ సమాచారం చెబితే ఇతర పార్టీలోకి వెళతారని.. జంపింగ్ ల వల్ల టీఆర్ ఎస్ కు దెబ్బపడుతుందని ప్రకటన జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఓడిపోయే ఎమ్మెల్యేలకు ప్రత్యామ్మాయ పదవులు ఇచ్చి గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఎమ్మెల్యేలను ఈ చివరి సంవత్సరంలో ప్రజలకు చేరువై హార్డ్ వర్క్ చేయాలని కేసీఆర్ సూచించబోతున్నాడని తెలిసింది..
ఇలా దేశం మొత్తం తనవైపు తిప్పుకునే పథకాలను ప్రవేశపెడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు అసంతృప్త ఎమ్మెల్యేలే పెద్ద అవరోధంగా మారారు. వారిని ఎలా మేనేజ్ చేసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.