Begin typing your search above and press return to search.

షర్మిల విషయంలో కేసీఆర్ నో కాంప్రమైజ్?

By:  Tupaki Desk   |   16 April 2021 7:30 AM GMT
షర్మిల విషయంలో కేసీఆర్ నో కాంప్రమైజ్?
X
పాపం ఆంధ్రా ఆడకూతురు. తెలంగాణ కొచ్చి రాజకీయం చేస్తోంది. పైగా దివంగత వైఎస్ఆర్ బిడ్డ. ఏదో రాజకీయం చేస్తానంటోంది. చేసుకుంటే అయిపోద్దీ కదా అనుకున్నారంతా.. కానీ పద్ధతిగా దీక్ష చేసుకుంటున్న ఆమెను కేసీఆర్ సర్కార్ వదల్లేదు.

పొద్దున్నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ సర్కారే టార్గెట్ గా షర్మిల దీక్ష చేపట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని నినదించారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకోని కీలకమైన నిరుద్యోగుల ఎజెండాను ఎత్తుకున్న షర్మిల ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ ను షేక్ చేస్తున్నట్టే లెక్క.

నీళ్లు, నిధులు ఇచ్చిన కేసీఆర్.. నియామకాల విషయంలో మాత్రం సీతకన్ను వేస్తున్నాడు. ఆది నుంచి తెలంగాణ కోసం కొట్టాడిన యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నాడు. రైతులే ఎజెండాగా వెళ్లారు. ఇటీవల ఉద్యోగులను సంతృప్తిపరిచాడు. కానీ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు మాత్రం కేసీఆర్ సర్కార్ నెరవేర్చడం లేదు.

అయితే ఇంతటి కీలకమైన అంశాన్ని అటు తెలంగాణలోని ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడూ టేకప్ చేయలేదు. కేసీఆర్ ను ఇరుకునపెట్టలేదు. కానీ వైఎస్ షర్మిల ఏకంగా దీన్ని తీసుకొని కేసీఆర్ కుంభస్థలాన్నే కొట్టాలని ప్లాన్ చేశారు.

షర్మిల దీక్షకు ఆర్.కృష్ణయ్య సహా పలువురు మేధావులు, సంఘాల నుంచి మద్దతు రావడంతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. బలమైన వాదాన్ని.. బలమైన శక్తులు షర్మిల వెంట నడిస్తే కష్టం అని భావించి షర్మిలకు చెక్ చెప్పారు. ఆమె దీక్షను భగ్నం చేశారు. లోటస్ పాండ్ కు పాదయాత్రగా వెళుతుంటే అరెస్ట్ చేసి తరలించారు.

ఇలా షర్మిల వెనుకాల కేసీఆర్ ఉన్నారన్న ప్రచారానికి నిన్నటితో తెరపడింది. కేసీఆర్ ఉంటే ఆమె సభ సజావుగా సాగేది. అయితే షర్మిల వెనుకాల బీజేపీ ఉందన్న ప్రచారం నిన్నటి సంఘటనతో కొందరిలో అనుమానాలు కలిగిస్తోంది. దీంతో ఏం జరిగిందో వెనుకాల తెలియదు కానీ.. సడెన్ గా షర్మిలను వదిలేది లేదు అంటూ ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కేసీఆర్. ఆమెను ఇక ఊరికే తెలంగాణలో తిరగనిచ్చేది లేదని అరెస్ట్ తో గట్టి సంకేతాలు పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు.