Begin typing your search above and press return to search.

అటు జగన్ ఇటు పవన్...కేసీయార్ కాపు పాలిటిక్స్ ?

By:  Tupaki Desk   |   27 Jun 2023 8:00 AM GMT
అటు జగన్ ఇటు పవన్...కేసీయార్ కాపు పాలిటిక్స్ ?
X
వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడవ సారి అధికారం లోకి రావడానికి బీయారెస్ అధినేత కేసీయార్ చూస్తున్నారు. ఈ గెలుపు ఆయన కు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈసారి గెలిస్తేనే కేసీయార్ జాతీయ స్థాయి రాజకీయ కలలు కూడా ఎంతో కొంత నెరవేరుతాయి. అలాగే ఆయన రాజకీయ వారసుడు కేటీయార్ కి కూడా ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది.

అందుకే కేసీయార్ తెలంగాణా భవన్ లో కాపు రాజకీయానికి పదును పెట్టినట్లుగా తెల్సుతోంది. కేసీయార్ హ్యాట్రిక్ విజయం తో పాటు ఏపీ లో ఆయన మిత్రుడు జగన్ కూడా గెలవడానికి కూడా వీలు కుదురుతుంది. అదే విధంగా ఏపీ లో పవన్ కళ్యాణ్ బలమైన శక్తిగా అవతరించేందుకు కేసీయార్ స్కెచ్ గీస్తున్నారు.

అదే విధంగా తన చిరకాల రాజకీయ శత్రువు చంద్రబాబు ని రాజకీయంగా ఏమీ కాకుండా చేయాలని చూస్తున్నారు. మరో వైపు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల లో కాంగ్రెస్ లేవకుండా దెబ్బతీయడం అన్న అజెండా కూడా ఉంది. మొత్తానికి కేసీయార్ కాపు రాజకీయం మీద రకరకాలైన చర్చ సాగుతోంది.

నిజానికి రెండు సార్లు తెలంగణా లో అధికారం లోకి వచ్చిన కేసీయార్ మీద ఈసారి రెడ్డీలు, మున్నూరు కాపులు తీవ్ర ఆగ్రహం లో ఉన్నారని అంటున్నారు. రెడ్డిల కు తెలంగాణా లో మంచి బలం ఉంది. రాజకీయంగా వారు ఎపుడూ ముందున ఉండే వారు. అలాంటి వారికి కేసీయార్ జమానా లో సరైన రాజకీయ వాటా దక్కలేదు అన్న అసంతృప్తి ఉంది.

ఇక చూసుకుంటే మున్నూరు కాపులు కూడా తెలంగాణా బీయారెస్ పాలన మీద మండిపడుతున్నారు. దాంతో వారి ని కూడా బుజ్జగించేందుకు కేసీయార్ రాజకీయ వ్యూహాన్ని పన్నారు దాంతో ఆయన ఆదివారం హైదరాబాద్‌ లో మున్నూరు కాపు ముఖ్య నేతలు సమావేశమై తమ సమస్యల పై చర్చించడంతో పాటు వచ్చే ఎన్నికల కోసం రాజకీయ వ్యూహాన్ని రచించారు. వీరి లో మెజారిటీ నేతలు బీఆర్‌ఎస్‌ కు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే తమ మద్దతును తెలిపినట్లు సమాచారం.

అదే విధంగ కేసీయార్ వారికి ఒక హామీ ఇచ్చారని అంతున్నారు. కాపుల కు భవనం కోసం అయిదు ఎకరాల స్థలం అలాగే వారికి రూ.10 కోట్ల రూపాయల నిధులను కూడా ఇచ్చేందుకు అంగీకరించారని టాక్. అదే విధంగా ఏపీ లో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడానికి కేసీయార్ తన వంతుగా సాయం చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

ఏపీ లో జనసేన టీడీపీ బీజేపీ లతో పొత్తు లేకుండా సొంతంగా కనుక పోటీ చేస్తే పూర్తి సహాయం బీయారెస్ నుంచి ఉంటుందని హామీ ఇచ్చారని అంటున్నారు. జనసేన కు రాజకీయంగా అవసరం అయిన ఎన్నికల ఖర్చు మొత్తం భరించేందుకు కూడా బీయారెస్ అధినేత ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

దీని వల్ల పవన్ కళ్యాణ్ కి ఏపీ లో రాజకీయ లాభం కలిగితే తెలంగాణా లో బీయారెస్ కి అది లాభంగా ఉంటుంది. మరో వైపు చూస్తే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పెద్ద ఎత్తున ఓట్లు చీలిపోయి జగన్ మళ్ళీ ఏపీ లో సీఎం అవుతారు. అలా చంద్రబాబు ని కూడా అడ్డుకున్నట్లు అవుతుంది. జగన్ కి మేలు చేసినట్లు అవుతుంది. తాను హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. పవన్ కి కూడా బలమైన రాజకీయ శక్తిగా అవతరించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలా బహుముఖ వ్యూహా లతో అటు తెలంగాణా ఇటు ఏపీల లో కేసీయార్ కాపు రాజకీయం స్టార్ట్ చేశారు అంటున్నారు. మరి దీనికి పవన్ ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది చూడాలి.

ఇదిలా ఉండగా కేసీయార్ తో భేటీకి ఇక ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, లక్ష్మీకాంతం, ఇతర రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ డీలర్లు తదితరులున్నారు. వీరంతా బలమైన కాపు నేతలు గా ఉన్నారు. మరి ఏపీ లో కేసీయార్ కాపు పాలిటిక్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.