Begin typing your search above and press return to search.
రైతు బంధు.. కట్ చేసేసిన కేసీఆర్.. భూస్వాములకు షాక్ లగా?
By: Tupaki Desk | 22 Feb 2023 12:00 PM GMTకేసీఆర్ కు గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్లు కురిపించిన పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’ అని చెప్పొచ్చు. అలాంటి అద్భుత పథకానికి ఇప్పుడు నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే రైతుబంధు డబ్బుల పంపిణీలో భూస్వాములకు కోత విధిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 11 ఎకరాలలోపు వారికి మాత్రమే జమ చేయనున్నట్టు ప్రకటించాడు.
'రబీ' సీజన్ కు సంబంధించిన రైతు బంధు సాయం రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. 11 ఎకరాల కన్నా ఎక్కువున్న వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు. అసలు సాయం అందుతుందో లేదోనన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.
అయితే 11 ఎకరాలు ఉంటే భూస్వాములే అని.. వారికి రైతు బంధు అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. మోడీ సర్కార్ కేవలం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే వేస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా 11 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ప్రతీసారి రైతు బంధు పడి ఈసారి బూస్వాములకు పడకపోవడంతో ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నట్టు తెలిసింది.
అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టేసింది. సాంకేతిక సమస్యలంటూ కాలయాపన చేస్తోంది. దీంతో వస్తాయో రావేమోనని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను రైతులు నిలదీస్తున్నారు.
ఎన్ని సమస్యలు వచ్చినా రైతు బంధు కొనసాగిస్తాం.. బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు పైసలు అందరికీ ఇస్తాం.. కటాఫ్ పెట్టే ప్రసక్తే ఉండదు అని రైతు బంధు స్కీమ్ పై కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు నీటి మూటలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పథకం కు ఇప్పుడు నిధుల కొరతతోనే కేసీఆర్ సర్కార్ పెద్ద రైతులకు ఇవ్వకుండా ఆపేసినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.