Begin typing your search above and press return to search.
హస్తినకు కేసీఆర్ వెళ్లినా.. కొడుక్కి పగ్గాలు ఇవ్వరా?
By: Tupaki Desk | 7 Sep 2020 4:45 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ పట్టాభిషేకం జరిగే రోజు దగ్గర్లోనే ఉందంటూ రాజకీయ వర్గాల్లో తరచూ ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా.. సీఎం ట్రయల్ రన్ భారీ ఎత్తున సాగుతున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం సాగుతోంది. అయితే.. ఇందుకు భిన్నమైన వాదన ఒకటి తాజాగా వినిపిస్తోంది. అందరు అనుకున్నట్లుగా కొడుకు కేటీఆర్ చేతికి పాలనా పగ్గాలు ఇచ్చే ప్రసక్తే లేదన్న మాట ఒకటి హాట్ టాపిక్ గా మారింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినప్పటికి.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని.. ఎట్టి పరిస్థితుల్లో కొడుకు చేతికి పగ్గాలు ఇచ్చే ఆలోచన కేసీఆర్ చేయటం లేదని అంటున్నారు.
ప్రజల్లో ఎంత పట్టున్నా.. కొన్ని లక్షణ రేఖల్ని ఇట్టే దాటేయటానికి కేసీఆర్ అస్సలు ఇష్టపడరు. అందునా తెలంగాణ ప్రజల మైండ్ సెట్ బాగా తెలిసిన ఆయన.. కొడుక్కి పట్టాభిషేకమనే పెద్ద తప్పును అస్సలు చేయరంటున్నారు. అదే సమయంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న హోదాకు.. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత అన్న హోదాకు మధ్య తేడా చాలా ఉంటుందని.. అందుకే సీఎం పదవిని వదులుకోవటానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు.
కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై ఇటీవల కాలంలో కేసీఆర్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఆశించినంతగా నిధులు రాకపోవటం.. చట్టబద్ధంగా రావాల్సిన జీఎస్టీ పరిహారంలోనూ కొర్రీలు పెడుతూ.. కావాలంటే అప్పు తీసుకోండి కానీ.. పరిహారం వాటాను రాష్ట్రాలు కోరిన రీతిలో ఇచ్చేందుకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటంతో పాటు.. అందుకు సంబంధించిన కసరత్తు పెద్ద ఎత్తున చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు నిజమైనప్పటికీ.. మరో ఆసక్తికర పరిణామం ఉంటుందని తెలుస్తోంది. అదేమంటే.. జాతీయ రాజకీయాల్లో ఎంత కీలక భూమిక పోషించినా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని మాత్రం కేసీఆర్ వదులుకోకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కావాలంటే కొడుకును ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పి.. సీఎం చేయాల్సిన పనుల్ని ఆయన చేత చేయిస్తారట.
నిజానికి మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రి తరహాలో చాలా కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు.. ఈ మధ్యన అనధికార మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. దాదాపు ఆరేడు గంటల పాటు జరిపిన సమావేశానికి.. మంత్రులంతా హాజరు కావటమే కాదు.. కేటీఆర్ ను సీఎంను చూసినట్లే చూశారన్న ప్రచారం అప్పట్లో సాగింది.
తాను కోరుకున్నంతనే ఫామ్ హౌస్ వెళ్లటం.. హైదరాబాద్ కు రావటం చేసే కేసీఆర్.. కీలకమైన అంశాలు తప్పించి.. చాలా అంశాలపై కేటీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా అలానే ఫాలో అవుతారని చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. మంత్రి కేటీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని తేల్చేస్తున్నారు. ఈ వాదనలో వాస్తవం ఎంతన్నది కాలం మాత్రమే సరిగా చెబుతుందని చెప్పక తప్పదు.