Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ..: పేరు ఇదే..
By: Tupaki Desk | 11 Jun 2022 3:29 AM GMTదేశంలో ఎన్నో జాతీయ పార్టీలున్నాయి. కానీ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు మనుగడ సాధించలేకపోయాయి. ఆ రెండు పార్టీలను కాదని మూడో పార్టీగా ఉండాలన్నదే తన ఉద్దేశ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.. కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు రెండు పర్యాయాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, ఇక దేశప్రజలను బాగు చేసేందుకు జాతీయ రాజకీయాలు అవసరమని కేసీఆర్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందదుకు కొత్త పార్టీని పెట్టనున్నట్లు తెలిపారు.
భారతీయ రాష్ట్ర సమితి, జై భారత్, నయా భారత్ వంటి పేర్లను కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి పేర్లను పరిశీలించారు. అయితే వీటిలో భారతీయ రాష్ట్ర సమితి వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నెలాఖరులో ఢిల్లీ వేదికగా కొత్త పార్టీ ప్రకటన చేసేలా ప్లాన్ వేస్తున్నారు. కొత్త పార్టీపై మంత్రులు, ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నారు. ఇందుకు అందరూ సరేనన్నారు. అయితే తెలంగాణ సీఎంగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు. ఈనెల 19న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీ అవతరిస్తుందన్నారు. కొత్త పార్టీతో పలు పార్టీలను ఏకం చేసి ఎన్డీఏ అభ్యర్థిని ఓడించేందుకు ప్లాన్ వేయాలన్నారు. దేశంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోయాయని, అయితే ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కు లేదన్నారు. అలాంటప్పుడు మూడో శక్తి కచ్చితంగా అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ తో బీజేపీకి ఎదుర్కోవచ్చన్నారు. బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ఎంతవరకైనా ముందుకు వెళ్దామన్నారు. ప్రస్తుతం దేశం చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలకు ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఉంది. కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలు శాసించే అవకాశం ఉంటుదన్నారు.
అయితే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ కొత్త పార్టీ ఏర్పాటుకే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నాలుగు పేర్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రర్ చేయించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ గుర్తు కూడా కారునే అడిగే అవకాశం ఉందన్నారు. త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈలోపే పార్టీ పేరును ప్రకటించాలని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై లోకల్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.