Begin typing your search above and press return to search.
ఇంటర్ అవకతవకలు.. పాపమెవరిది?
By: Tupaki Desk | 26 April 2019 11:49 AM GMTకేసీఆర్ అనుకున్నది ఒక్కటి.. అయ్యిందొక్కటి.. కాళేశ్వర ప్రాజెక్ట్ వెట్ రన్ మొదలు పెట్టి గోదావరిని ఉప్పొగించి అపర భగీరథుడిగా పేరొందాలని కేసీఆర్ కలలుగన్నాడు. కానీ ఆ క్రెడిట్ మొత్తం ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలతో కొట్టుకుపోయింది. ఎప్పుడు మొదలయ్యిందో.. ఎలా మొదలయ్యిందో కానీ కేసీఆర్ ప్రభుత్వాన్నే డిఫెన్స్ లో పడేసింది. అందరితో కార్నర్ చేయించింది.
*ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు తప్పు ఎవరిది?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా కాని రాద్ధాంతం తాజాగా జరిగింది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అధికారుల అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కేటీఆర్ సన్నిహితుడి సంస్థగా ప్రచారంలో ఉన్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పులకు విద్యార్థులు బలయ్యారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో విద్యార్థుల మెమోలన్నీ 0 - 1 మార్కులతో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది నిజమో అనికొని చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 20కు పైగా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్లోబరీనా అనే సంస్థ చేసిన నిర్లక్ష్యపు వాల్యుయేషన్ ను తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారులు కనీసం క్రాస్ చేసుకోకపోవడమే ఇంత పెద్ద అనర్థానికి కారణంగా చెబుతున్నారు. ఇందులో గ్లోబరీనా అనే సంస్థ తప్పు ఎంత ఉందో.. ఫలితాలు కనీసం చెక్ చేసుకోకుండా అలాగే విడుదల చేసిన ఇంటర్ అధికారుల తప్పు అంతే ఉంది..
*ఆత్మహత్యల పరంపర..ఆందోళనల సెగ
ఫలితాలు విడుదలయ్యాయి. మార్కులు తలకిందులయ్యాయి. హతాషులైన పసిమనుసులు ఆత్మహత్యలు చేసుకున్నాయి. ముందు వెనుక ఆలోచించకుండా తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ తనువు చాలించుకున్నారు. దీంతో మిగతా బాధిత విద్యార్థులు - తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ మీదకు దండెత్తారు. వారికి విద్యార్థి సంఘాలు - ప్రతిపక్ష నాయకులు తోడయ్యారు. దీంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ మరోసారి నిరసనలతో భగ్గుమంది. కేసీఆర్ సర్కారును ఇరకాటంలో పడేసింది..
*చేతులు కాలాక ఆకులు పట్టిన కేసీఆర్
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు - సినీ - రాజకీయ ప్రముఖుల విమర్శలు - విద్యార్థులు - తల్లిదండ్రులు - ప్రతిపక్షాల ముప్పేట దాడితో లేట్ గా నాలుగైదు రోజులకు స్పందించిన కేసీఆర్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. తప్పులపై కమిటీ.. ఫెయిల్ అయిన విద్యార్ధులందరికీ పేపర్ల రీవాల్యుయేషన్ ను ఉచితంగా చేయాలని ఆదేశించాడు. కానీ ఇదేదో జరిగిన రోజే చేసుంటే కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ క్రెడిబులిటీ ఇంతలా దిగజారేది కాదనడంలో ఎలాంటి సందేహం లేదు.
*చల్లారిన వేడి.. తగ్గని విమర్శల వాడి.. ప్రక్షాళన జరగాల్సిందే..
కేసీఆర్ తీసుకున్న చర్యలు ప్రస్తుతానికైతే విద్యార్థులను - తల్లిదండ్రులను ఉపశమనానికి గురిచేశాయి. కానీ మొన్నటి ఎంసెట్ లీకేజీ - నేడు ఇంటర్ అవకతవకలు ఇలా విద్యావ్యవస్థనే భ్రష్టు పట్టిపోయింది తెలంగాణలో.. అన్నింటిని ప్రక్షాళన చేస్తున్న కేసీఆర్ విద్యా - ఉద్యోగాల విషయంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారు. మీనవేషాలు లెక్కిస్తున్నారు. జర ఈ విద్యారంగాన్ని పట్టించుకొని కత్తిలాంటి మంత్రిని పెట్టి సంస్కరణలు చేస్తే తప్ప తెలంగాణ విద్యార్థుల గోసలు ఇప్పట్లో తీరేలా లేవు.. కేసీఆర్ సారూ.. జర సోచాయించు..