Begin typing your search above and press return to search.

ఆ ముద్ర లేకుంటే.. కేసీఆర్‌కు క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 AM GMT
ఆ ముద్ర లేకుంటే.. కేసీఆర్‌కు క‌ష్ట‌మే!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌డం వ‌ర‌కు బాగానే ఉంది. తెలుగు నేల‌కు చెందిన నాయ‌కుడు.. ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మైన‌ప్పుడు.. తెలుగు వారిగా అంద‌రూ స్వాగ‌తిస్తారు. అయితే.. గ‌తంలో ఢిల్లీలో ప్ర‌ధానిగా చ‌క్రం తిప్పిన‌.. పీవీ న‌ర‌సింహారావు అయినా.. కేంద్ర రాజ‌కీయాల్లో బ‌ల‌మైన ముద్ర వేసిన‌.. ఇత‌ర తెలుగు నాయ‌కులైనా.. ఉత్త‌రాది ప్ర‌జ‌ల మ‌న‌సును మాత్రం గెలుచుకోలేక పోయారు.

జాతీయ పార్టీల వ్యూహం అంతా కూడా. ఉత్త‌రాది నుంచి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే.. యూపీ, బిహార్‌, జార్ఖండ్ త‌దిత‌ర రాష్ట్రాల్లోని పార్ల‌మెంటు స్థానాల‌ను.. తీసుకుంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల మొత్తం పార్ల‌మెంటు స్థానాల‌తో స‌మానం. ముఖ్యంగా 80 స్థానాలు ఉన్న యూపీ అత్యంత ప్రాణ‌ప్ర‌దం. ఇక‌, తూ ర్పు భార‌తంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో 40+ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా రాజ‌స్థాన్‌, పంజాబ్‌లోనూ పార్ల‌మెంటు స్థానాల‌కు ప్రాధాన్యం ఉంది.

ఆయా రాష్ట్రాల్లో ఫోక‌స్ పెట్టి.. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో ఓకే అనిపించుకుంటే త‌ప్ప‌.. కేంద్రంలో మోడీ వంటి బ‌ల మైన నాయ‌కుడిని ప‌క్క‌న పెట్ట‌డం.. సాధ్యం కాద‌నేది నిర్వివాదాంశం. మ‌రీముఖ్యంగా.. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌నుకునే నాయ‌కుడికి.. ఉత్త‌రాది స‌పోర్టు అత్యంత కీల‌కం.

ఈ నేప‌థ్యంలో గ‌త నేత‌ల‌ను చూసు కుంటే.. బ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌.. గెలిచి.. పీఎం అయిన‌.. పీవీ న‌ర‌సింహారావుకు.. ఇలాంటి ఇబ బ్బంది రాలేదు. కానీ, వ్య‌క్తిగ‌తంగా.. పార్టీ పెట్టుకుని.. ప్రాంతీయ పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని వెళ్లాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్‌కు ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నేది మేధావుల మాట‌.

మ‌రోవైపు.. ప్రాంతీయ పార్టీల కూట‌మిలో చూసినా.. కేసీఆర్‌.. కేవ‌లం 17 ఎంపీ స్థానాల‌తో(తెలంగాణ‌లో ఉన్న‌వి అవే) ఇత‌ర పార్టీల‌పై పైచేయి సాధించ‌డం అనేది క‌ష్ట‌మేనని మేధావులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో జాతీయ పార్టీని ఉత్త‌రాదిలో విస్త‌రింప జేసి... ముఖ్యంగా మ‌హారాష్ట్ర,, పంజాబ్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పుంజుకునే ప్ర‌య‌త్నం చేసి.. కేసీఆర్ క‌నుక‌.. ఉత్త‌రాది నేత‌గా గుర్తింపు ద‌క్కించుకుంటే.. త‌మ ఆకాంక్ష‌లు నెరవేరుస్తార‌నే బ‌ల‌మైన వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌గ‌లిగితే.. ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.