Begin typing your search above and press return to search.
అమరావతి శంకుస్థాపన ఫలకంపై కేసీఆర్ పేరు
By: Tupaki Desk | 21 Oct 2015 11:37 AM GMTమరో వివాదం మొదలైంది. అతిధిగా వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనసారా ఆహ్వానించటానికి సిద్ధమైన సీమాంధ్రులకు.. తాజాగా బయటకొచ్చిన విషయం ఒక పట్టాన మింగుడు పడటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న కేసీఆర్ పేరును.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ శిలాఫలకంపై చేర్చటం వివాదంగా మారింది.
రాష్ట్ర విభజనకు కారణమైన వ్యక్తి.. సీమాంధ్రులు ఇన్ని కష్టాలకు గురి చేస్తున్న వ్యక్తి పేరును అమరావతి శిలాఫలకం మీద ఎలా చెక్కిస్తారన్నది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీమాంధ్రులలో హాట్ టాపిక్ గా మారింది. అతిధిగా రావటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ.. అమరావతి శిలాఫలకం మీద కేసీఆర్ పేరును ఎలా ఒప్పుకోగలమని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యే ప్రధాని.. ముఖ్యమంత్రి.. గవర్నర్ ఇతర ప్రముఖల పేర్లను శిలాఫలకం మీద చేర్చాల్సి ఉంటుందని.. మరో మార్గం లేదని చెబుతున్నారు. మరి.. ఈ వాదనకు సీమాంధ్రులు సంతృప్తి చెందుతారో లేదో..?