Begin typing your search above and press return to search.

ఆ ఇష్యూలో కేసీఆర్ బాబుని ఫాలో అయి ఉంటే?

By:  Tupaki Desk   |   24 Jan 2016 4:39 AM GMT
ఆ ఇష్యూలో కేసీఆర్ బాబుని ఫాలో అయి ఉంటే?
X
సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య రేపిన రాజకీయ దుమారం అంతాఇంకా కాదు. విద్యార్థి ఆత్మహత్య చివరకు దళిత టర్న్ తీసుకోవటం.. దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పక్షాలకు చెందిన నేతలు రియాక్ట్ కావటం లాంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఇష్యూ జరిగిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లే క్రమంలో ఉన్నారు.

తాను లేకున్నా.. తన రాష్ట్రానికి చెందిన రోహిత్ (గుంటూరు జిల్లా గురజాల) వివరాలు సేకరించటం.. ఆ కుటుంబానికి పరామర్శ.. నష్టపరిహారం అందించటం లాంటివి చకచకా చేయించిన చంద్రబాబు.. ఈ విషయం మీద మిగిలిన రాజకీయ పక్షాలు స్పందించిన రీతిలో రియాక్ట్ కాకపోవటం గమనార్హం. పరామర్శలు.. పరిహారం లాంటి విషయాల్ని పెద్ద ప్రచారం లేకుండా పూర్తి చేసిన ఆయన.. రోహిత్ ఆత్మహత్యపై జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా నిలవటం.. ఆయన ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఏదీ చేయకపోవటం గమనార్హం.

పరిహారం.. పరామర్శ అన్న రెండు అంశాలు వ్యూహాత్మకంగా చేపట్టి.. తన మీద విమర్శలు రాకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు.. అదే సమయంలో ఆ విషయాలు పెద్దగా ప్రచారం రాకుండా ఉండటం ద్వారా రోహిత్ ఇష్యూను వ్యతిరేకిస్తున్న వారికి దూరం కాకుండా జాగ్రత్త పడ్డారు. రోహిత్ ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామ్ గా ఉండిపోయారు. ఆయన తీరుపై ఇప్పటికే దళిత విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్య మీద కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి మాటలకు చంద్రబాబు అవకాశం ఇవ్వకుండా అటు రోహిత్ వర్గానికి.. ఇటు రోహిత్ ఇష్యూలో విరుద్ధమైన వాదనను వినిపిస్తున్న రెండు వర్గాలకు దూరం కాకుండా ఏపీ సీఎం జాగ్రత్త పడ్డారన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వాటిని పక్కన పెడితే.. రోహిత్ ఉదంతంలో బాబు బాటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పయనించి ఉంటే బాగుండేదన్న భావన పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.