Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో తీర్మానం..కేంద్రానికి కేసీఆర్ షాక్

By:  Tupaki Desk   |   16 March 2020 9:46 AM GMT
అసెంబ్లీలో తీర్మానం..కేంద్రానికి కేసీఆర్ షాక్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్రంలోని బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా వ్యతిరేకించారు. కేంద్రంలోని బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సంచలన కామెంట్స్ చేశారు.

సీఏఏ నిబంధనల ప్రకారం తీసుకుంటే ఎవరూ ఈ దేశ పౌరులు కారని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ లేదని.. తనకు కూడా బర్త్ సర్టిఫికెట్ లేదని.. ఊళ్లో పంతులు రాసిన జన్మపత్రికే తన బర్త్ సర్టిఫికెట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దాన్ని తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని సీఏఏ తీరును అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కడిగిపారేశాడు. నా పరిస్థితియే ఇలా ఉంటే కూలీలు - పేదలు - మహిళల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విచిత్రమైన పద్ధతి సీఏఏలో పెట్టారని కేసీఆర్ ఎండగట్టారు. ఓటర్ ఐడీ కార్డు కూడా పనిచేయకపోతే బర్త్ సర్టిఫికెట్లు లేని వారు దేశంలో కోట్ల మంది ఉన్నారని.. వారి పరిస్థితేంటని నిలదీశారు.

సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులు అవుతారని అని బీజేపీ ప్రచారంపై కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏపై దేశంలో సమీక్ష జరగాలని.. తాము గుడ్డిగా దీన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. హిందూ - ముస్లింల సమస్య సీఏఏ కాదన్నారు. దేశం మంచివైపు నడవాలని అందుకే పార్లమెంట్ లోనూ ఈ బిల్లును టీఆర్ ఎస్ వ్యతిరేకించిందని అన్నారు. ప్రజల భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టడం సరైందని కాదని స్పష్టం చేశారు.

చొరబాటు దారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పడం లేదని.. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోడలు కట్టాడని.. అలాంటివి చేయాలన్నారు. సీఏఏ వల్ల భారత్ లోని ఢిల్లీలో 50మంది చనిపోయారని.. సీఏఏపై పునసమీక్షించాలని కేసీఆర్ కోరారు.

సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 16న తీర్మానం కూడా చేసింది. ఇప్పటికే కేరళ - బెంగాల్ - పంజాబ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ - ఢిల్లీలు కూడా అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకించి తీర్మానం చేశాయి.