Begin typing your search above and press return to search.

మూసి కంటే ముందు కెసిఆర్ నోరు శుభ్రం చేయాలి: బండి సంజయ్

By:  Tupaki Desk   |   29 Nov 2020 4:30 AM GMT
మూసి కంటే ముందు కెసిఆర్ నోరు శుభ్రం చేయాలి: బండి సంజయ్
X
బండి సంజయ్ బిజెపి తెలంగాణ అధ్యక్షుడైనప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీతోపాటు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు చుక్కలు చూపిస్తున్నారు. దుబ్బాకలో విజయంతో ఆల్ రెడీ ఓ పీడకలను మిగిల్చారు. మిగతా బీజేపీ నేతలందరి కంటే కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా కెసిఆర్ పాలనపై సంజయ్ విరుచుకుపడుతున్నాడు. ప్రతీ స్టెప్ ను అందిపుచ్చుకొని దాడులు చేస్తున్నారు. ఇప్పుడు సంజయ్ తాజాగా కెసిఆర్ బహిరంగ సభపై పడ్డారు. అలాగే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనను రాద్ధాంతం చేస్తున్న టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ క్యాష్ చేసుకునే అన్ని ప్రయత్నాలను లక్ష్యంగా చేసుకొని దెబ్బకొడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఏమీ చేయడం లేదని, జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని బిజెపి భయపడుతోందని కెసిఆర్ చేసిన ప్రకటనను బండి సంజయ్ తీవ్రంగా తిప్పికొట్టారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వెంటనే ఏమి చేయాలంటే ముందుగా కెసిఆర్ అపరిశుభ్రమైన నోరును శుభ్రం చేయాలి. ఆయన నోరు కలుషితమైన మూసీ నది కంటే డేంజర్. రాష్ట్ర అభివృద్ధిపై కెసిఆర్, కెటిఆర్ లు ఏమాట్లాడకుండా అబద్ధాలు చెబుతున్నారు. నిధులు మింగేస్తున్నారని విమర్శించారు.

కెసిఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఫ్లాప్ షోగా బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం జంట నగరాల్లోని ప్రజలకు వరదల నుంచి రక్షణకు లేకుండా చేసిందని ఆరోపించారు.. ప్రజల కోసం ఏమీ చేయకుండా, కెసిఆర్ మరియు టిఆర్ఎస్ మరోసారి ఓటర్లకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరమన్నారు.. 18కి పైగా రాష్ట్రాల్లో ఉగ్రవాదులను నియంత్రించినందున బిజెపి మాత్రమే తెలంగాణ రక్ష అని ఆయన అన్నారు. హైదరాబాద్ దీనికి మినహాయింపు కాదన్నారు.. బిజెపి అధికారంలోకి వచ్చి నగరంలో ఆర్డర్ తీసుకువస్తుందన్నారు.