Begin typing your search above and press return to search.
కేసీఆర్ రికార్డు స్థాయి సమావేశం ఇది
By: Tupaki Desk | 14 Dec 2016 4:58 PM GMT31 జిల్లాల కలెక్టర్లు - అదే రీతిలో మరో 31 మంది ఎస్పీలు - వీరు కాకుండా మరో నాలుగు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు - రాష్ట్ర మంత్రులు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు - ముఖ్య కార్యదర్శులు - కమిషనర్లు - వీరే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు...ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తాలుకు భారీ దృశ్యం! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్మించిన నూతన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో ఈ భారీ చిత్రం గోచరించింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నట్లు భారీ సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇటు క్యాంప్ ఆఫీసు - అటు సచివాలయం అనువుగా లేదు. నూతన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో భారీగా విస్తరించి ఉన్న ప్రగతి భవన్ లోని అతిపెద్ద సమావేశ మందిరంలో వలయాకారంలో టేబుళ్లు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా పెద్ద హాలులో ముఖ్యమంత్రి ఎక్కడో దూరంగా కనిపించడాన్ని దృష్టిలో ఉంచుకొని వలయాకారం టేబుళ్ల మధ్యన భారీ తెరలతో కూడిన 14 టీవీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ తనదైన శైలిలో సుదీర్ఘంగా చర్చించారు. అంశం ఏదైనా ప్రారంభం నుంచి విశ్లేషించే కేసీఆర్ తాజాగా సైతం అదే రీతిలో ప్రసంగించారు.
కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ నిర్దేశించారు. అత్యవసర వినియోగానికి ప్రతీ జిల్లా కలెక్టర్ వద్ద రూ.3కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయని వీటితో ఆస్పత్రులు - వసతి గృహాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రతి జల్లా కలెక్టర్ కు రూ.3కోట్లు చొప్పున రూ.93 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమని కేసీఆర్ అన్నారు. అర్బన్ - రూరల్ - వ్యవసాయ - పారిశ్రామిక - గనుల పరంగా జిల్లాల వారిగా ప్రాధాన్యాలు మారుతాయి. దీన్ని బట్టి ప్రణాళిక వేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇలా ప్రతీ జిల్లాలో జరగాలని సీఎం నిర్దేశించారు. సంక్షేమ రంగంలో రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతూ..నంబర్ వన్ గా నిలిచామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కావడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం ఉందని పేర్కొంటూ కేవలం డబ్బులతోనే అన్ని పనులు కావని అన్నారు. మంచి పాలసీలు, పథకాలు రావాలి, అవి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/