Begin typing your search above and press return to search.
కేసీఆర్ అడుగుపెడితే హుజూరాబాద్ లో మార్పు ఖాయమా?
By: Tupaki Desk | 14 Aug 2021 10:30 AM GMTహుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మరో రెండు నెలల్లో జరగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఈ మేరకు హింట్ కూడా ఇచ్చింది. దీంతో అధికార టీఆర్ఎస్ ఫుల్ నజర్ పెట్టింది. హుజూరాబాద్ లో బలంగా ఉన్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించడానికి ఈ సమయం చాలు అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆగస్టు 16న హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ బహిరంగ సభనే టీఆర్ఎస్ పాలిట ‘గేమ్ చేంజర్ గా’ అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ రాకతో గాలి మొత్తం టీఆర్ఎస్ వైపు మల్లుతుందని అంటున్నారు.
దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ హుజూరాబాద్ వస్తున్నారు. ఇక్కడే బహిరంగ సభ నిర్వహించి ప్రారంభించి హుజూరాబాద్ దళితులకు ఇంటికి రూ.10లక్షల చొప్పున అందజేయబోతున్నారు. దీన్నే హుజూరాబాద్ ఎన్నికల శంఖారావంగా కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే ఈ సభలో కేసీఆర్ నేరుగా ఈటల రాజేందర్ పై దాడి చేయకపోవచ్చు. కానీ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా.. తన విలక్షణమైన శైలిలో బీజేపీని ఖచ్చితంగా లక్షంగా చేసుకుంటాని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ట్రబుల్ షూటర్, మేనల్లుడు అయిన హరీష్ రావును హుజూరాబాద్ లో దించాడు. గత కొద్దిరోజులుగా హరీష్ రావు, మరో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
దాదాపు ఏడేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైనందుకు ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. మహిళ ఓటర్లను ఆకర్షించడంపై హరీష్ రావు దృష్టి సారిస్తుండగా.. మంత్రి గంగుల బీసీ ఓటర్లపై దృష్టి పెట్టారు.
ఆగస్టు 16న ముఖ్యమంత్రి దళితబంధును ప్రారంభించడంతో దళిత ఓటర్లు టీఆర్ఎస్ తోపాటు భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికలలో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని టీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది.