Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కొత్త బస్సు..ఖర్చు జస్ట్ 7 కోట్లే
By: Tupaki Desk | 6 March 2018 8:35 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ నిర్ణయం తీసుకున్నారు. తన భద్రత కోసం వచ్చిన కీలక ప్రతిపాదనకు ఆయన ఓకే చెప్పేశారు. ఏకంగా రూ.7 కోట్లతో కొత్త బస్సు కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పేశారు. సీఎం కేసీఆర్ పర్యటనకు రూ.7 కోట్లతో కొత్త బస్సు కొనుగోలుకు ఏకంగా కమిటీ వేయడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భారీగా క్యాడర్ ను నష్టపోయిన మావోలు పగతో రగిలిపోతున్నారు. దెబ్బకు దెబ్బ తీస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచారు.
దీనికి కొనసాగింపుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ఇస్తున్న దానికంటే అదనపు భద్రతను కల్పించాలని రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు అత్యాధునిక సదుపాయాలు ఉన్న బస్సును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేసీఆర్ వినియోగిస్తున్న బస్సు విలువ రూ.4కోట్లు. ఛండీగడ్ కు చెందిన జేసీపీఎల్ సంస్థ దీనిని తయారు చేసింది. గత మూడేళ్ల నుంచి సీఎం ఈ బస్సునే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరిన్ని అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉన్న బస్సును కొనబోతున్నారు. రూ.7 కోట్లకు పైగా విలువైన ఈ బస్సును మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించే సమయంలో వినియోగిస్తారు. ఈ బస్సు ఎలా ఉండాలి.. ఇందులో సదుపాయాలు ఏంటీ..? అన్న విషయంపై ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పేసిన నేపథ్యంలో ఈ కొనుగోలు నిర్ణయం తీసుకున్నారు. అయితే వరుసగా రెండో ఏడాది కూడా ఈ మేరకు ఖర్చు చేస్తూ బస్సు కొనుగోలు చేయాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.