Begin typing your search above and press return to search.

సౌత్ ఇండియా హక్కులు.. బీజేపీ దిమ్మదిరిగే కేసీఆర్ ప్లాన్

By:  Tupaki Desk   |   2 Aug 2019 9:06 AM GMT
సౌత్ ఇండియా హక్కులు.. బీజేపీ దిమ్మదిరిగే కేసీఆర్ ప్లాన్
X
జాతీయవాదం ఎజెండాతోనే ఓట్లు కొల్లగొట్టి దేశంలో బీజేపీని మోడీ మరోసారి అధికారంలోకి తీసుకొచ్చాడన్నది నిర్విదాంశం. పొలిటికల్ అనలిస్టులు, రాజకీయ నిపుణులు మోడీ వేసిన ఈ జాతీయ వాదం స్కెచ్చే జనాలను ఒక్కటి చేసిందని.. బీజేపీకి ఓట్ల వర్షం కురిపించిందని ఘంటాపథంగా చెబుతుంటారు..

పాకిస్తాన్ పై దాడులను, హిందుత్వాన్ని, సైనికుల త్యాగాలను మోడీ తన ఖాతాలో వేసుకొని గెలిచాడని విమర్శలున్నాయి. మోడీయేకాదు.. తెలంగాణలో కేసీఆర్ కూడా ఆంధ్రా నేతలను బూచీగా చూపి బాబు వస్తున్నాడని.. ఆంధ్రా పెత్తనం అవసరమా అని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేశాడని విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు తెలుగురాష్ట్రాలను కబళించేందుకు వస్తున్న మోడీషాలపై కేసీఆర్ రెడీ చేసిన అస్త్రం కూడా ఇదేనట.. ఉత్తరాది నేతల ఆధిపత్యంలో సౌత్ ఇండియా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని.. పదవులు, పంపకాలు, నిధుల్లో సౌత్ రాష్ట్రాలపై నిర్లక్ష్యం కనపడుతోందని కేసీఆర్ కొత్త వాదన తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్టు తెలిసింది. టీఆర్ఎస్ ముఖ్యుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటిలో కేసీఆర్ తన మదిలోని అత్యంత విలువైన అస్త్రం ఇదేనని బయటపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

మోడీ కనుక తెలంగాణ, ఏపీలో బలపడాలని వస్తే.. టీఆర్ ఎస్, వైసీపీలపై అధికారబలంతో ఉక్కుపాదం మోపితే ఎదుర్కోవడానికి కేసీఆర్ ‘సౌత్ ఇండియా హక్కుల’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కేంద్రంలోని బీజేపీని ఇరుకునపెట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. దేశంలో సౌత్ నేతలు, రాష్ట్రాలకు నిధులు, విధులు, పదవుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటడానికి దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో కూటమి కట్టాలని నాయకత్వం వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ఒకవేళ మోడీషాలు తెలంగాణపై దండెత్తితే ‘సౌత్ ఇండియా హక్కుల సాధన’ పేరిట ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేశారని సమాచారం. ఈ మేరకు జగన్ తో కూడా ఇదే విషయం చర్చించి ఆయన మద్దతు కోరినట్టు తెలిసింది.

ఇక ఇప్పటికే కేసీఆర్ కు తమిళనాడులో బలమైన ప్రతిపక్ష నేత స్టాలిన్, కర్ణాటకలో కుమారస్వామి, కేరళలో సీపీఐ విజయ్ లతో మంచి స్నేహం ఉంది. వారితో కలిసి మెప్పించి బలమైన మోడీని దీటుగా ఎదుర్కోవడానికి సౌత్ ఇండియా హక్కుల సాధన సమితిని తెరపైకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. సౌత్ కు జరుగుతున్న అన్యాయం.. దేశంలో ఉత్తరాది వారి ఆధిపత్యం, సౌత్ కు అభివృద్ధి, నిధుల్లో వివక్షను ఎలుగెత్తి చాటి మోడీషాలను డిఫెన్స్ లో పడేసేలా కేసీఆర్ మదిలో ఈ ఆలోచన గూడుకట్టుకున్నట్టు తెలిసింది. దీన్ని జగన్ తో తెలుపగా పూర్తి మద్దతిస్తానని చెప్పినట్టు సమాచారం.

సో మోడీషాలు గనుక దండెత్తి వస్తేనే కేసీఆర్ ఈ ప్లాన్ అమలు చేస్తాడట.. తమను టచ్ చేసే వారకు ‘సౌత్ కు అన్యాయం’ అనే అస్త్రాన్ని వాడరని సమాచారం.