Begin typing your search above and press return to search.

యాగంలో భక్త పరమాణవులు ఐఏఎస్ లు

By:  Tupaki Desk   |   24 Dec 2015 4:45 AM GMT
యాగంలో భక్త పరమాణవులు ఐఏఎస్ లు
X
వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. రాష్ట్ర పరిపాలనలో బిజీగా ఉండాల్సిన కీలక అధికారులంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నఅయుత చండీయగానికి విచ్చేసిన వారు.. భక్త పరమాణువులుగా మారిపోయారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న చండీయాగానికి సీనియర్ ఐఏఎస్ అదికారులు హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. వారంతా దీక్షా దుస్తులతో (పసుపుపచ్చపంచె.. కండువా) ప్రత్యేక పూజలో కూర్చోవటం విశేషం.

ఇలా ప్రత్యేక పూజలో కూర్చున్న కీలక అధికారులు ఒకరో.. ఇద్దరో కాదు.. పెద్ద ఎత్తున ఉండటం కనిపించింది. అధికారులతో పాటు.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు పూజలో కూర్చున్న వారిలో ఉన్నారు. ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు సైతం కుటుంబ సభ్యులతో చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయటం గమనార్హం.

ఇలా ప్రత్యేక పూజలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ.. సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు.. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ లు హాజరయ్యారు వీరితో పాటు హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా.. మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్.. స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే ఒక వ్యక్తిగత యాగానికి హాజరు కావటం తప్పు కాదు కానీ.. అంతా పూజల్లో పాల్గొనటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక.. తొలిరోజు యాగానికి వచ్చిన వీఐపీలు భారీగా ఉన్నారు. యాగానికి వచ్చిన వీవీఐపీలు చూస్తే..

= గవర్నర్ నరసింహన్ దంపతులు

= హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బోసాలే

= ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్

= తొగుల పీఠాధిపతి మాధవానంద శర్మ

= శ్రీశైలం పీఠాధిపతి

= హంపి పీఠాధిపతి తదితరులు

= ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ గురూజీ

= ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఉదయం 11 గంటలకు వచ్చి కార్యక్రమం అయ్యే వరకు ఉన్నారు. కేసీఆర్ కు సమీపంలో కుర్చీ వేసుకొని కూర్చొని తిలకించారు.

= తొలి రోజు యాగాన్ని 50వేల మంది వరకు దర్శనం చేసుకున్నట్లు అంచనా