Begin typing your search above and press return to search.
కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదమే.. తాజా పరిస్థితికి కారణమా?
By: Tupaki Desk | 30 Nov 2020 2:30 AM GMTయంత్రాలు తప్పులు చేయవు. ఒకవేళ చూస్తే.. రిపేరుకు వచ్చినట్లే. మనిషి అలా కాదు. తప్పులు చేస్తే కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. అందుకే అంటారు.. తప్పులు చేయటం పని చేసే వాడి లక్షణమని. పని చేయనోడికి.. ప్రయోగాలు చేయనోడికి.. తప్పులు అన్నవి ఉండవు. అందుకే అంటారు.. తప్పులు చేయటం తప్పేం కాదు. కానీ.. చేసిన తప్పు మళ్లీ చేయకూడదని. రాజకీయ వ్యూహ చతురుడిగా..అపర చాణుక్యుడిగా పేరున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి మహానేత కూడా తప్పులు చేస్తారా? అంటే.. ఎందుకు చేయరనే సమాధానం వస్తుంది.
అధికారం మహా సిత్రమైనది. దూరంగా ఉన్నప్పుడు ఊరిస్తుంటుంది. దాన్నిసాధించాలనే ఆత్రుత ఉంటుంది. తమ లోపాల్ని ఎంత త్వరగా దిద్దుకుంటే అంత త్వరగా విజయం సాధిస్తుందని భావిస్తారు. అలాంటివారు తీరా విజయం తమ చేతికి వచ్చిన తర్వాత.. తమకు మించిన పోటుగాళ్లు లేరనుకోవటమే కాదు.. తాము అస్సలు తప్పులే చేయమని భావిస్తారు. అందుకే.. అధికారం చేతికి వచ్చిన తర్వాత చాలామంది లోపాల్ని వినటానికి ఇష్టపడరు. తప్పులు ఎత్తి చూపటాన్ని సహించరు.
ఇందుకు కేసీఆర్ మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే.. టీఆర్ఎస్ కు కాస్త అధిక్యతను ఇచ్చారు. మరిన్ని పార్టీలు కాంగ్రెస్.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్.. బీజేపీ.. ఇలా పార్టీలు అనేకం ఉండేవి. ఇలా అయితే భవిష్యత్తులో రాజకీయం చేయటం కష్టమని భావించిన కేసీఆర్.. రాష్ట్రంలో తమ పార్టీ తప్పించి.. మరే పార్టీ ఉనికి ఉండకూడదన్నట్లుగా ఎత్తులు వేశారు.
ఆయన వేసి వ్యూహంలో సదరు పార్టీలు చిక్కుకోవటం.. చాలా పార్టీలు మాయం అయిపోయాయి. చివరకు కాంగ్రెస్ నిలిస్తే.. కొన ఊపిరితో బీజేపీ కొట్టుమిట్లాడే పరిస్థితి. 2018లో జరిగిన ఎన్నికల ఫలితం తీవ్ర నిరాశకు గురి చేస్తే.. అధికార పక్షం పండుగ చేసుకునేలా చేసింది. అయితే.. ఈ దూకుడుకు బ్రేకులు వేసేలా 2019 ఎంపీ ఎన్నికల తర్వాత మళ్లీ లెక్కలు మారాయి. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాస్తంత సీన్ ఉందన్న మాటతో పాటు.. బీజేపీకి కూడా బలం ఉందన్న విషయం తేలింది. తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ ఉనికికోసం పోరాడే పరిస్థితికి వస్తే.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు ఆశావాహ పరిస్థితుల్లోకి వచ్చారు. ఇలాంటివేళలోనే కాసింత సిత్రం జరిగింది. సాధారణంగా ఏ పార్టీ కూడా పూర్తిగా మాయం కావాలని ఏ పార్టీ అధినేత కోరుకోరు.
కానీ.. భిన్నమైన ఆలోచన ధోరణి ఉన్న కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ను రాజకీయంగా రాష్ట్రంలో ఖతం చేయాలన్న ఆలోచన వచ్చిందంటారు. అందుకు తగ్గట్లే అప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో తమ కారులోకి ఎక్కించేసుకున్నారు. ఉన్నకొద్ది పాటి మందితో అయ్యేది ఏమీ లేదన్న విషయంపై క్లారిటీ వచ్చాక మౌనంగా ఉండిపోయారు.దీంతో.. రాజకీయ శూన్యత పెరిగింది. అది అంతకంతకు పెరగటమేకానీ తగ్గేది లేదన్నట్లుగా మారింది.
దీంతో కాంగ్రెస్ అంతకంతకూ బలహానమైపోతుంటే..తెలంగాణలో అధికారపక్షానికి దమ్ముగా నిలుచునే పార్టీలేకపోవటంతో రాజకీయ శూన్యత మొదలైంది. ఎవరో వస్తే తప్పించి.. తెలంగాణ అధికారపక్షాన్ని టచ్ చేసే సీన్ లేదని తేలింది. ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది బీజేపీ పావులు కదిపింది. కాలం కలిసి వచ్చినట్లుగా దుబ్బాక ఉప ఎన్నిక రావటం.. అందులో బీజేపీ తన సత్తా చాటటంతో.. తనకు తెలీకుండా తనకు పెరిగిన బలాన్ని చూసి కమలనాథులు మురిసిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ ను ఖతం పెట్టించటం వల్ల తనకు ఎదురైన సవాలు ఏమిటన్నది కేసీఆర్ కు అప్పటికి కానీ అర్థం కాలేదంటారు. నిజానికి కమలనాథుల్ని డీల్ చేసే కన్నా కాంగ్రెస్ వారిని డీల్ చేయటం చాలా తేలికన్న విషయం కేసీఆర్ కు ఇప్పడిప్పుడే అర్థమైందంటారు. ఒకవిధంగా చెప్పాలంటే.. కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదమే.. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు కారణమైంది. లేకుంటే.. గజరాజు లాంటి గులాబీ పార్టీ.. కమలం పువ్వు పేరు చెప్పినంతనే బెరుకు కనిపించటం ఏమిటి?