Begin typing your search above and press return to search.
ఢిల్లీలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ లోనూ మిస్ కాని '6'
By: Tupaki Desk | 4 May 2023 9:35 AM GMT'ఆరు' అంకెకు బీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా కీలకమైన కార్యక్రమాన్ని చేపట్టే వేళలో.. ఆయన ఎంచుకునే సమయంలో అంతిమంగా ఆరు వచ్చేలా చూసుకుంటారు. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించే సమయంలో ఆరు అంకె వచ్చేలా ముహుర్తాన్ని సెట్ చేయటం తెలిసిందే.
తాజాగా ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు (గురువారం) ఓపెన్ చేస్తున్నారు. ఇందుకోసం ఈ ఉదయం సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఆయన తన ప్రయాణాన్ని మార్చుకున్నారు.
ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వాస్తు పూజ.. సుదర్శన హోమం.. దాని అరంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ముహుర్తాన్ని 1.05ను కలిపితే.. చివరకు వచ్చేది ఆరు కావటం గమనార్హం. పార్టీ ఆవరణలో పార్టీ జెండాను ఎగురవేసి.. పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టనున్నారు. అనంతరం పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.
అధికారికంగా ఇవాళ బీఆర్ఎస్ ఆఫీసు భవనాన్ని ప్రారంభిస్తున్నా.. వాటి కార్యకలాపాలు మాత్రం వారం నుంచి పది రోజుల తర్వాతే షురూ చేస్తామని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనులు కొంత మిగిలి ఉన్నాయని.. వాటిని పూర్తి చేసిన తర్వాత నుంచి పార్టీకార్యాకలాపాల్ని అక్కడి నుంచి నిర్వహించనున్నారు.
తాజా ట్రిప్ లో సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటి లానే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని.. ముఖ్యుల్ని.. వివిధ పార్టీలకు చెందిన నేతలతోనూ భేటీ కానున్నట్లు చెబుతున్నారు.